మూవీ రివ్యూ : ది ఘోస్ట్

దర్శకుడు ప్రవీణ్ సత్తారు
నటీనటులు అక్కినేని నాగార్జున, అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్, సోనాల్ చౌహాన్, మనీష్ చౌదరి, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, బిలాల్ హొస్సేన్
నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, నారాయణ్ దాస్ నారంగ్, శరత్ మరార్
సంగీతం భరత్-సౌరభ్

చాన్నాళ్లుగా సరైన హిట్ లేదు నాగార్జున కి. తన తోటి సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్ అప్పుడప్పుడు హిట్స్ ఇచ్చినా కానీ నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. చాలా నమ్మకం పెట్టుకున్న ‘వైల్డ్ డాగ్’ తీవ్ర నిరాశపరిచింది. తాజాగా ‘ది ఘోస్ట్’ అనే సినిమాతో మళ్ళీ మన ముందుకు వచ్చాడు నాగార్జున. ‘గరుడావెగా’ లాంటి యాక్షన్ మూవీ తీసిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు డైరెక్టర్. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ:

మాజీ RAW ఆఫీసర్ అయిన విక్రమ్ ప్రస్తుతం ఇండియన్ ఎంబసీలో ఉద్యోగం చేస్తుంటాడు. ఒక రోజు తన కూతుర్ని ఎవరో చంపాలని చూస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది.  విక్రమ్ అదితిని రక్షించడం మొదలుపెడతాడు. తన కూతురికి ముప్పు తలపెట్టాలనుకున్న వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. తన కూతుర్ని చంపాలనుకున్నది ఎవరు, విక్రమ్ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మిగతా కథ.

సినిమా ఎలా వుంది:

ది ఘోస్ట్ సినిమా స్టోరీ కొత్తగా ఏమి ఉండదు. ఇప్పటివరకూ ఇలాంటి సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది. అయితే ట్రీట్మెంట్ మాత్రం కొత్తగా ఉంది. కానీ అదితిని చంపాలనుకున్న అందరిని అంత క్రూరంగా చంపడానికి గల కారణం అంత కనెక్ట్ అవ్వదు. విక్రమ్ బ్యాక్ స్టోరీని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా చూపించి ఉంటే ఇంకా బాగుండేది.

విక్రమ్ పాత్రలో నాగార్జున అక్కినేని ఓకే. అనిఖా సురేంద్రన్ ప్రతి సినిమాతో మెరుగవుతుంది. సోనాల్ చౌహాన్ గ్లామర్‌గా కనిపించింది, కానీ ఆమె పెర్ఫార్మెన్స్ జస్ట్ ఓకే.

ఓవరాల్ గా  ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్. ఎమోషనల్ కంటెంట్ మినహాయిస్తే కొన్ని పవర్ ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాల కోసం థియేటర్లలో చూసి ఆనందించవచ్చు.