ఏపీలోని నెల్లూరు జిల్లాల్లో వైసీపీ రాజకీయాలు వేడెక్కాయంటున్నారు విశ్లేషకులు.. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న అత్యంత కీలకమైన రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఒక మంత్రికి అనుకూలంగా మారిపోయిందనే వ్యాఖ్యలు ప్రచారంలోకి వస్తున్నాయి.. ఇదొక్కటే కాదు ఏపిలోని అన్ని జిల్లాల్లో దాదాపుగా కుల రాజకీయాలు సాగుతాయన్న విషయం తెలిసిందే.. ఇలాంటివి అప్పుడప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తాయి.. ఈ క్రమంలోనే ప్రస్తుతం నెల్లూరులో జరిగే వర్గపోరు బయటకు పొక్కింది.. ఆ వివరాలు తెలుసుకుంటే..
నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు కీలక మంత్రులు వైసీపీలో చక్రం తిప్పుతున్నారట.. వారే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతం రెడ్డి అని అంటున్నారు.. ఇకపోతే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు యువకులు కావడంతో పాటుగా అధిక మోతాదులో దూకుడు కూడా ప్రదర్శించే నాయకులుగా పేరు తెచ్చుకున్నారు.. ఈ ముచ్చట ఇదివరకటిది.. అయితే ప్రస్తుతం మాత్రం వీరిద్దరి మధ్య వర్గపోరు మొదలైందట.. చిన్న చిన్న కారణాలతో ఈ మంత్రుల మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. అదీగాక అనిల్ కుమార్ ఎక్కువగా దూకుడు ప్రదర్శించడాన్ని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారట.. అదే సమయంలో మేకపాటి గౌతం రెడ్డి మాత్రం మౌనంగా తన పనితాను చేసుకు పోతున్నారు.
ఈ నేపధ్యంలో మంత్రి గౌతమ్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద అపరిశుభ్రత పేరుకుపోయి దారుణంగా మారడంతో ఆయన అధికారులకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందన లేదట. మంత్రి క్యాంపు ఆఫీసు నుంచి ఫోన్ చేసినా ఎవరూ పట్టించులేదని సమాచారం. దీంతో మంత్రి గౌతమ్ రెడ్డి స్వయంగా కలవమని చెప్పినా హెల్త్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ లెక్కచేయలేదని వార్తలు గుప్పుమన్నాయి.. దీంతో ఆయన మునిసిపల్ అధికారులపై ఫైరయ్యారట.. ఈ విషయం చిలికి చిలికి రాజకీయ వివాదంగా మారింది.
ఈ క్రమంలో ఇప్పటికే మంత్రి అనిల్‌దూకుడును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు ఒక్కటై మంత్రి గౌతంరెడ్డికి మద్దతుగా నిలిచారట. వీరే కాకుండా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డిలు కూడా మంత్రి మేకపాటికి మద్దతుగా మారి. అనిల్‌పై చర్యలకు పట్టుబడుతున్నట్టుగా సమాచారం.. ఇలా ఇక్కడి రెడ్లంతా ఒక్కటిగా మారి ఈ వివాదాన్ని ఇంకెంత దూరం తీసుకు వెళ్లుతారో అని అనుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు..