TDP: ఆ టీడీపీ ఎమ్మెల్యేకు పొగబెడుతున్నారా.. ఆ వ్యక్తి కుట్ర వల్లే నెగిటివ్ ప్రచారమా?

రాజకీయాలలో కొన్ని సందర్భాల్లో మంచి చేసినా అలాంటి వ్యక్తుల విషయంలో కుట్రలు జరుగుతూ ఉంటాయి. 2024 సంవత్సరంలో అనంతపురం అర్బన్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ రికార్డ్ స్థాయి మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించారనే సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన నిమిషం నుంచి దగ్గుబాటి ప్రసాద్ ప్రజలకు మేలు చేసేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వాటిని వేగంగా పరిష్కరిస్తూ మంచి మనస్సును చాటుకుంటున్నారు. అయితే దగ్గుబాటి ప్రసాద్ ఇంత కష్టపడుతున్నా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో కొంతమంది ఆయన గురించి తీవ్ర స్థాయిలో నెగిటివ్ ప్రచారం చేస్తుండటం ఒకింత సంచలనం అవుతోంది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా ఎమ్మెల్యేనే టార్గెట్ చేయడంపై ప్రజల్లో చర్చ జరగడంతో పాటు ఇలా చేస్తున్న వాళ్లను కఠినంగా శిక్షించాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దగ్గుబాటి ప్రసాద్ చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక ఒక రాజకీయ నేత ఆయన గురించి ఈ తరహా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. వైరల్ అయిన ఆడియో రికార్డ్, భూ కబ్జాల ఆరోపణలు అన్నీ దగ్గుబాటి ప్రసాద్ పై జరుగుతున్న కుట్రలో భాగమేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.. సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత దగ్గుబాటి ప్రసాద్ ను టార్గెట్ చేశారని పొలిటికల్ వర్గాల భోగట్టా. ఈ తరహా ఘటనల వల్ల కూటమి పరువు పోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్స్ గురించి కానీ రాప్తాడులో పట్టుబడ్డ గోవా మద్యం గురించి కానీ ఎమ్మెల్యేకు లింక్ చేస్తూ కథనాలు వెలువడటం ఆయనపై జరుగుతున్న కుట్రలో భాగమేనని తెలుస్తోంది. మంచి ఎమ్మెల్యే పరువు తీస్తున్న సీనియర్ నేతతో కూటమి పెద్దలు సయోధ్య కుదర్చాలని స్థానికులు భావిస్తుండగా ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం సదరు నేతపై చర్యలు తిసుకోవాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే ప్రజలకు నేరుగా కలిసేలా అడుగులు వేస్తుండటం మరో నేత టార్గెట్ చేయడానికి కారణమైందని తెలుస్తోంది. కూటమి పెద్దలు పార్టీకి చేటు చేసి నెగిటివ్ ప్రచారం చేస్తున్న నేతపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వర్గీయులు కోరుకుంటున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న నేత తీరుపై ప్రజలు విమర్శలు చేయడంతో పాటు మంచి చేసేవాళ్లను సైతం చేయనివ్వరా అని ప్రశ్నిస్తున్నారు.