బాలీవుడ్ నటిని ఒక రాత్రి తనతో ఉండమని కోరిన దక్షిణాది నిర్మాత !

Neena gupta revealed about the casting couch incident

బాలీవుడ్ సీనియర్ నటి ‘నీనా గుప్తా’ ఇటీవల విడుదల చేసిన తన ఆత్మకథలో చిత్ర పరిశ్రమలో తాను అనుభవించిన అనేక అవాంఛనీయ సంఘటనల గురించి రాశారు. అందులో ఒక సినీ నిర్మాత ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా వివరించింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Neena gupta revealed about the casting couch incident

దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో నటిస్తున్న నీనా గుప్తా కెరీర్ తొలినాళ్లలో చాలామంది హీరోయిన్ లానే అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిందట. అలాంటి సమయంలో “ఒక రోజు, నా స్నేహితుడు దక్షిణాదికి చెందిన ఒక పెద్ద నిర్మాత గురించి చెప్పి ఆయనని కలవమని చెప్పడంతో ఆ నిర్మాత ఉన్న ముంబై లోని ఒక పెద్ద హోటల్‌ కి వెళ్లాను. మొదట హోటల్‌ లాబీలో కూర్చుని ఆయనకి కాల్ చేయగా తన గదికి రమ్మని కోరడంతో వెళ్లక తప్పలేదు.

ఆయన చేయబోయే ఒక పెద్ద బడ్జెట్ సినిమాలో నాకు ఒక పాత్రని ఆఫర్ చేసాడు. అలాంటి పాత్రని చేయటం ఇష్టంలేని నేను సున్నితంగా ఆయనకు నో చెప్పాను. ఇక అక్కడి నుండి వెళ్లిపోతుండగా ఆయన…. ఏంటి… వెళ్ళిపోతున్నావా! ఈ రాత్రికి ఇక్కడే నాతో ఉండట్లేదా అని అడిగిన ప్రశ్నతో నేను షాక్ అయ్యాను. నా స్నేహితులు క్రింద ఎదురుచూస్తున్నారని చెప్పి అక్కడి నుండి హుటాహుటిన బయటకి వచ్చేశానని ” అలా క్యాస్టింగ్‌ కౌచ్‌ నుండి అదృష్టవశాత్తు బయటపడినట్లుగా నీనా గుప్తా తన పుస్తకంలో వెల్లడించింది.