తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. అయితే, అది మినీ పాదయాత్ర తరహాలో వుండబోతోందట. వయసు మీద పడ్డంతో చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర చేసే పరిస్థితి లేదు. అందుకే, మినీ పాదయాత్రకు టీడీపీ సన్నాహాలు చేస్తోందట. 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టే పాదయాత్ర ఏర్పాట్లు జరగనున్నాయట.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్నీ, అన్ని ప్రధాన పట్టణాల్నీ కవర్ చేసేలా చంద్రబాబు మినీ పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. అయితే, ఆయా ప్రాంతాలకు ప్రత్యేక వాహనంలో చేరుకుని, కొంత సేపు మాత్రమే పాదయాత్ర చేసేలా టీడీపీ వ్యూహరచన చేస్తోందని తెలుస్తోంది. పాదయాత్ర ద్వారానే అధికారం దక్కతుందన్న భావన రాజకీయాల్లో ఇప్పుడు బలపడిపోయింది. తెలంగాణలో ఎడా పెడా పాదయాత్రలు షురూ అవుతున్నాయి.. కొందరు ఇప్పటికే పాదయాత్రల్లో బిజీగా వున్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రజా సంకల్ప యాత్ర చేశారు.. ఆ పాదయాత్రతోనే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. కేవలం పాదయాత్రలతోనే అధికారం వస్తుందా.? అంటే, ఖచ్చితంగా అవును.. అని చెప్పలేం. ఎందుకంటే, పాదయాత్రల పట్ల ప్రజల్లో సింపతీ క్రియేట్ అయితే, నాయకుడిపై నమ్మకం ప్రజలకు కలిగితేనే.. ఆ యాత్రలు సక్సెస్ అవుతాయి.
కాగా, నారా లోకేష్‌తో సుదీర్ఘ పాదయాత్ర చేయిస్తే ఎలా వుంటుంది.? అన్న చర్చ కూడా టీడీపీలో జరుగుతున్నప్పటికీ, చంద్రబాబు పాదయాత్ర చేస్తే.. లోకేష్ పార్టీ వ్యవహారాలు చక్కబెడితేనే లాభమని సీనియర్లు అభిప్రాయపడుతున్నారట. అన్నట్టు, వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే చంద్రబాబు