Lady Super Star: లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ నెక్స్ట్ ఆ హీరోయిన్ కి రానుందా.. నయన్ తర్వాత ఆ నటికే రేంజ్ ఉందా!

Lady Super Star: తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు చాలా అరుదుగా మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు అనగా రెండు దశాబ్దాల క్రితం వరకు విజయశాంతిని లేడీస్ చూపిస్తారుగా పిలిచేవారు అభిమానులు. ఎన్నో సినిమాలలో నటించి చాలామంది అభిమానులను సంపాదించుకోవడంతో పాటు లేడీస్ సూపర్ స్టార్ గా కూడా సత్తాని చాటారు విజయశాంతి. అయితే విజయశాంతి తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీలో దక్కించుకున్న ఏకైక హీరోయిన్ నయనతార.

ఇంతవరకు బాగానే ఉన్న నయనతార తర్వాత సౌత్ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ అనే స్టేటస్ దక్కే హీరోయిన్ ఎవరు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆమధ్య ఒకసారి సమంత ఆల్మోస్ట్ సూపర్ స్టార్ స్టేటస్ కు దగ్గరగా వచ్చేసింది అని అనిపించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ స్లో అయింది. దీంతో మరోసారి ఇప్పుడు ఈ చర్చ మొదలయ్యింది. అయితే లేడీస్ సూపర్ స్టార్ ట్యాగ్ రేసులో ప్రజెంట్ ఉన్న హీరోయిన్లలో ఇద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొదటి పేరు సాయి పల్లవి కాగా మరొక పేరు రష్మిక మందన.

ఈ ఇద్దరూ హీరోయిన్లలో ఎవరు సూపర్ స్టార్ బిరుదును అందుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. రష్మికకు నటిగానూ మంచి పేరే ఉన్నా కూడా ఎక్కువ సక్సెస్‌ లు మాత్రం గ్లామర్ రోల్స్‌ తోనే వచ్చాయి. గ్లామర్ అన్న మాటకు చాలా దూరంగా ఉండే సాయి పల్లవి కేవలం తన నటనతోనే నెంబర్‌ వన్‌ రేసులోకి వచ్చారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ముందు లేడీ సూపర్ స్టార్‌ అనిపించుకుంటారో చూడాలి మరి. ఈ విషయంలో మాత్రం ఇద్దరి పేర్లు సమానంగానే వినిపిస్తున్నాయి. అలాగే ఈ ఇద్దరు హీరోయిన్లకు ఉన్న ఫ్యాన్స్ బేస్ గురించి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.