నయనతారను భలే హత్తుకున్నాడే.. న్యూ ఇయర్ స్పెషల్ పిక్

Nayanathara Vignesh shivan 2021 Special pic
 

నయనతార విఘ్నశ్ శివన్ సోషల్ మీడియాలో ఆడే దొంగాట గురించి అందరికీ తెలిసిందే. ప్రతీ పండుగకు అలా మెరిసి ఇలా వెళ్లిపోతుంటారు. స్పెషల్ సందర్భాల్లో మాత్రమే ఇలా సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటారు. అది కూడా అందరూ షాక్ అయ్యేలా పోజులిస్తుంటారు. మామూలుగా నయన్ విఘ్నేశ్‌లు తమ బర్త్ డేలు, ఓనమ్ పండుగ వంటి సందర్భాల్లోనే ఎక్కువగా హడావిడి చేస్తుంటారు. నయనతార సోషల్ మీడియా ప్రపంచానికి ఎంతో దూరంగా ఉంటుంది.

Nayanathara Vignesh shivan 2021 Special pic

నయన్‌కు సోషల్ మీడియా ఖాతాలేవీ కూడా లేవు. అన్నీ కూడా విఘ్నేశ్ శివన్ చేతుల మీదుగానే నడుస్తుంటాయి. ప్రస్తుతం నయన్ విషయాలు తెలుసుకోవాలంటే విఘ్నేశ్ శివన్‌ను ఫాలో అవ్వాల్సిందే. అలా విఘ్నేశ్ ప్రత్యేక సందర్భాల్లో నయన్ ఫోటోలను షేర్ చేస్తుంటాడు. ఓనమ్ పండుగ, నయన్ మదర్ కురియన్ బర్త్ డే, తన బర్త్ డే సందర్భంగా స్పెషల్ పిక్స్‌ను షేర్ చేశాడు. క్రిస్మస్ సందర్భంగా నయన్‌తో కలిసి విఘ్నేశ్ బాగానే ఎంజాయ్ చేశాడు.

ఇక తాజాగా న్యూ ఇయర్‌ను కూడా ఈ ఇద్దరూ జంట పక్షులు బాగానే సెలెబ్రేట్ చేసుకున్నట్టున్నారు. ఈ మేరకు విఘ్నేశ్ షేర్ చేసిన ఫోటోలు బాగానే వైరల్ అవుతున్నాయి. విఘ్నేశ్ నయన్ ఒకరి కళ్లల్లో మరొకరు చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నయన్‌ను ఎంతో ప్రేమగా పట్టుకుని హత్తుకున్నట్టు కనిపిస్తోంది. ఇద్దరూ ప్రేమలో పీకల్లోతు వరకు మునిగినట్టున్నారు. ఇక ఈ ఫోటోలో నయన్ వేసుకున్న డ్రెస్ అదరహో అనేలా ఉంది.