పెళ్లి బంధంతో ఒకటైన నయన్, విఘ్నేశ్.. హాజరైన స్టార్ సెలబ్రెటీలు!

తమ ప్రేమ బంధంతో ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు మూడు ముళ్ళతో ఒక్కటయ్యారు నయన్, విఘ్నేశ్. ఈరోజు మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో తెల్లవారుజామున 2.22 గంటలకు తమ కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల సమక్షంలో ఒకటయ్యారు.

అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. ఇక షారుక్ ఖాన్, సూపర్ స్టార్ రజినీకాంత్ లతో పాటు పలువురు స్టార్ సెలబ్రెటీలు కూడా హాజరు కాగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక వీటికి సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని నెట్టింట్లో వైరల్ గా మారాయి. మొత్తానికి నయనతార ఒక ఇంటి కోడలిగా అడుగు పెట్టేసింది.