తమ బంధంలో మరోక అడుగు ముందుకేసిన నవ్య స్వామి.. రవి క్రిష్ణతో పెళ్లికి రెడీ..?

బుల్లితెర నటులు రవికృష్ణ , నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీనాక్షి సీరియల్ ద్వార నవ్య స్వామి చాలా పాపులర్ అయ్యింది. ఇక వరూధిని పరిణయం సీరియల్ ద్వారా రవి క్రిష్ణ కూడా బాగా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ కలిసి” ఆమె కథ” అనే సీరియల్ లో నటించారు. ఈ సీరియల్ ద్వార వీరిద్దరు జంటగా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవి షోస్ లో కూడా సందడి చేస్తున్నారు.

అయితే ఎక్కడ చూసినా వీరిద్దరూ ఇలా జంటగా కనిపించడంతో వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షోలో వీరిద్దరూ మెంటర్స్ గా సందడి చేస్తున్నారు. రష్మీ, సుధీర్ లాగా వీరిద్దరూ కూడ లవ్ ట్రాక్ వల్ల బాగా ఫేమస్ అయ్యారు. అంతే బయట కూడ వీరిద్దరూ పార్టీలు , షాపింగ్ లని కలిసి తిరుగుతూ కనిపిస్తున్నారు. అందువల్ల వీరిద్దరూ కచ్చితంగా ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు. అంతే కాకుండా రవి క్రిష్ణ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిస్తే నవ్య స్వామి కన్నీళ్లు పెట్టుకోవటం, నవ్య కోసం రవి కృష ఎంత దూరమైనా వెళ్ళటం చూస్తుంటే వీరు తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే తాజాగా వీరిద్దరి గురించి మరొక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నవ్య స్వామి, రవికృష్ణ ప్రేమ గురించి ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో వీరు ప్రేమ నుండి పెళ్లి వైపు మరొక అడుగు ముందుకేసారు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం వారి యాక్టింగ్ లైఫ్ లో చాలా బిజీగా ఉన్నారు. అందువల్ల వీరి పెళ్ళికి ఇంకా కొన్ని సంవత్సరాలు టైం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే 2025 లో వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటికానున్నరని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరి గురించి వస్తున్న ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.