అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ చూసి మురిసిపోయిన నవదీప్.. ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?

పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ తొందర్లోనే ప్రారంభం కానుంది. చందమామ,ఆర్య 2, అలా వైకుంఠపురంలో వంటి పలు సినిమాలలో నటించిన నవదీప్ తనకంటూ మాంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆర్య 2 సినిమా సమయం నుండి అల్లు అర్జున్ నవదీప్ కి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అప్పటినుండి ఇప్పటివరకు వీరిద్దరు ఎంతో క్లోజ్ గా ఉంటారు. అయితే ఇటీవల అల్లుఅర్జున్ సందర్భం ఏమీ లేకపోయినా నవదీప్ కి ఒక గిఫ్ట్ ని పంపించాడు.

అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ చూసి మురిసిపోయిన నవదీప్ ఇంస్టాగ్రామ్ వేదికగా అల్లు అర్జున్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల అల్లు అర్జున్ ఎయిర్‌పోడ్స్ ని నవదీప్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో నవదీప్ ఆ ఎయిర్‌పోడ్స్ ని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసి
” హద్దులు లేనంత ప్రేమ ఉన్నప్పుడు.. సందర్భమేమీ లేకుండానే గిఫ్టులు వచ్చేస్తాయి..” థాంక్స్ బావా. సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్ తో ఎయిర్‌పోడ్స్ వాడుతా… అంటూ రాసుకొచ్చాడు.

ఆర్య 2 సినిమా సమయం నుండి మొదలైన వీరి స్నేహం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇటీవల అల్లు అర్జున్ సెర్బియాలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ వేడుకలలో అల్లుఅర్జున్ అత్యంత స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ క్రమంలో నవదీప్ కూడా సెర్బియాలో జరిగిన అల్లు అర్జున్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. సినిమాల విషయానికి వస్తే నవదీప్ అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటున్నారు. ఇకపోతే వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి తెలియడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.