టాటా గ్రూప్ సంస్థల చైర్మన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటరాజన్ చంద్రశేఖరన్ తాజాగా మరో కొత్త బాధ్యతను చేపట్టాడు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా హక్కులను జనవరిలో టాటా గ్రూప్ దక్కించుకుంది. దాంతో ఆ సంస్థ టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ సీఈవో ఇల్కర్ ఐసిని సీఈవోగా బాధ్యతలు అందించింది.
కానీ ఇటీవలే ఆయన నియమాలపై కొన్ని విమర్శలు ఎదురవడంతో పూర్తి బాధ్యతలు చేపట్టక ముందుకే తన పదవికి రాజీనామా చేశాడు. దీంతో తాజాగా చంద్రశేఖర్ ను ఎయిర్ ఇండియాకు కొత్త చైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది టాటా గ్రూప్. దీంతో ఈ విషయాన్ని తాజాగా టాటా గ్రూప్ ప్రకటన చేసింది.