రెండోసారి సీఎంగా యోగి ఆదిత్యనాథ్.. ముస్లిం నేతకు కేబినెట్ లో చోటు!

ఇటీవలే యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో బీజేపీ మరోసారి ముందడుగు లో నిలిచింది. దీంతో యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రిగా గెలుపొందాడు. ఇక ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఎకానా స్టేడియంలో జరిగింది.

ఇక ఈ కార్యక్రమం కు ప్రధాన మోదీతో పాటు పలువురు బీజేపీ మంత్రులు పాల్గొన్నారు. ఇందులో మంత్రులుగా 52 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అందులో డానిష్ అజాద్ అన్సారీ అనే ముస్లిం వ్యక్తికి కేబినెట్ లో మంత్రి అవకాశం దక్కింది. డిప్యూటీ సీఎంగా కేశవ్ ప్రసాద్ మౌర్య బాధ్యతలు తీసుకున్నాడు.