ఎమ్మెల్యే గా నారా రోహిత్ !

nara rohit

 రాజకీయంగా నారా వారి పేరు తెలుగు రాష్ట్రల్లో బాగా సుపరిచితం. చంద్రబాబు నాయుడు పుణ్యనా వారి ఇంటి పేరు బాగా ప్రసిద్ధి చెందింది. విద్యార్థి సంఘ నేతగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత దేశం గుర్తించే స్థాయికి ఎదగటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీస్తే అందులో ఖచ్చితంగా చంద్రబాబు పేజీ అనేది ఉంటుంది.

nara rohit

 ఇక ఆయన తర్వాత చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు కొంత కాలం పాటు రాజ‌కీయంగా యాక్టీవ్‌గా ఉన్నారు. చంద్ర‌గిరి నుంచి సీనియ‌ర్ మ‌హిళా నాయ‌కురాలు గ‌ల్లా అరుణ‌కుమారిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే అనారోగ్య కార‌ణాల‌తో ఆ త‌ర్వాత కాలంలో ఆయ‌న రాజ‌కీయంగా అదృశ్య‌మ‌య్యారు.

 రామ్మూర్తినాయుడు తర్వాత చంద్రబాబు కొడుకు లోకేష్ గత టర్మ్ లో ఎమ్మెల్సీగా ఎన్నికై బాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి, 2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయి ప్రస్తుతం ఎమ్మెల్సీ గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుండి మరొకరు ఎమ్మెల్యేగా రాబోతున్నారు.

 అయితే అది రియల్ లైఫ్ లో కాదు, రీల్ లైఫ్ లో మాత్రమే, చంద్రబాబు తమ్ముడు కొడుకు హీరో నారా రోహిత్ త్వరలో ఎమ్మెల్యే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నివాస్ -సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమాలో న‌టించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ సినిమాలో యంగ్ హీరో నారా రోహిత్ యువ ఎమ్మెల్యే పాత్రలో కీల‌క రోల్ చేయ‌నున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

 మంచి నటుడు అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు కానీ , సినీ రంగప్రవేశం చేసి దశాబ్దం పూర్తైన సరే సరైన హిట్ అనేది లేక కెరీర్ లో కిందామీదా పడుతున్న నారా రోహిత్ కు రియల్ లైఫ్ లో తమ ఫ్యామిలీ కి అచొచ్చిన రాజకీయం, రీల్ లైఫ్ అతనికి కూడా కలిసివస్తుందేమో చూడాలి.