Nara Rohith: టాలీవుడ్ హీరో నటుడు నారా రోహిత్ గురించి మనందరికీ తెలిసిందే. నారా ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే నారా రోహిత్ నటించిన లేటెస్ట్ సినిమా భైరవం. ఈ సినిమా తాజాగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సక్సెస్ లో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన కెరీర్ కు సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటున్నారు.
తను హీరో నటుడు అవడం అన్నది తన కల కాదని తన తండ్రి కల అని చెప్పుకొచ్చారు నారా రోహిత్. కాగా రామ్మూర్తి నాయుడు చదువుకునే టప్పుడు కాలేజీల్లో నాటకాలు వేసేవారట. కానీ ఆయన నటన స్టేజ్ వరకే పరిమితమైంది.దాంతో సినిమాల్లోకి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో తన తండ్రి కలను కొడుకు రూపంలో చూసుకోవాలనుకున్నారట. అందుకే ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే రోహిత్ ని నటుడు అవ్వమని అడిగారట. అలా అడిగిన వెంటనే రోహిత్ కుదరదు అని చెప్పాడట. కానీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నటుడు అవుతానని ఒకే చెప్పాడట.
ఆ తర్వాత పెదనాన్న నారా చంద్రబాబు నాయుడు భుజం తట్టడంతో అమెరికాలో యాక్టింగ్ శిక్షణ తీసుకున్నట్లు తెలిపాడు. నటుడిగా తాను సక్సెస్ అయిన నిజమైన ఫైటర్ మాత్రం తన తండ్రి అని అన్నాడట. తనలో పోరాట పటిమ నుంచి తాను కూడా అలా మారానని తెలిపాడు రోహిత్. కుటుంబం నుంచి పెద్దగా సహకారం ఉండదు. ఇల్లు వదిలేసి వచ్చి సక్సెస్ అయిన తర్వాత వెళ్లిన కుమారులు ఎంతో మంది. ఇండస్ట్రీలో ఇలాంటి కథలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సినిమా రంగం అన్నది గ్యారెంటీ లేని జీవితం. బాగా చదువుకుని సినిమాల్లోకి వెళ్తామంటే అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకుంటారని వాదిస్తుంటారు. అలాగని తల్లిదండ్రుల వాదన అర్దం లేనిది కాదు. ఎంతో కష్టపడినా ఇండస్ట్రీలో అవకాశాలు రాక ఫెయిల్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. జీవితం అలా అవుతుందనే సినిమాలంటే? తల్లిదండ్రులు అంగీకరించరు అని చెప్పుకొచ్చారు నారా రోహిత్. ఈ సందర్భంగా నారా రోహిత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.