AP: ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఏడబాటు పెరుగుతోందా అంటే అవునని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో మరింత పట్టిష్టం చేసుకొనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలుస్తుంది. ఇక తన తదుపరి ముఖ్యమంత్రిగా తన వారసుడు లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇచ్చే విధంగా ఈయన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నారా లోకేష్ పార్టీ బాధ్యతలను తీసుకొని ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఐటీ, పరిశ్రమలు విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.
ఇకపోతే త్వరలోనే లోకేష్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం కూటమి పార్టీలలో భాగంగా ఒక్కరే డిప్యూటీ సీఎం గా ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదన ఆయన ప్రతిపాదన మేరకు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పచెప్పారు. కానీ ఇటీవల కాలంలో తిరుపతి లడ్డు విషయంలో కానీ తొక్కిసలాటం ఘటనలో కానీ ఇటీవల ప్రధాని పర్యటనలో పవన్ కళ్యాణ్ కీలక ప్రాధాన్యత పోషించారు తద్వారా ఈయనకు మరింత క్రేజ్ ఏర్పడుతున్న నేపథ్యంలో లోకేష్ గ్రాఫ్ పడిపోతుందని తెలుగుదేశం నేతలు ఈ విషయాన్ని బాబు దృష్టికి తీసుకువెళ్లారట.
ఈ క్రమంలోనే లోకేష్ ప్రాధాన్యత తగ్గకుండా ఉండటం కోసమే ఆయనకు డిప్యూటీ పదవిని అప్పజెప్పబోతున్నారని సమాచారం.ఆ తరువాత సీఎం సీటును అప్పగించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రణాళికలను కూడా సిద్ధం చేయబోతున్నారని తెలుస్తోంది.టీడీపీ ప్రణాళికలను నిశితంగా గమనిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందికు సమ్మతించక పోవచ్చన్నది జనసేన వర్గాల్లో టాక్. చంద్రబాబు కనుక అలాంటి నిర్ణయమే తీసుకుంటే, తాము ఎలా రియాక్ట్ అవాలనే విషయమై కూడా జనసేనలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది.