అన్‌స్టాపబుల్: నెక్స్‌ట్ బాలయ్య వెర్సస్ నాని

Nani With Balayya For Unstoppable | Telugu Rajyam

ఆహా ఓటీటీ తెరపై బాలయ్య కనీ వినీ ఎరుగని రీతిలో ‘అన్‌స్టాపబుల్’ అంటూ ఓ టాక్ షోకి హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సెలబ్రిటీలతో బాలయ్య చేసే ఓపెన్ ఇంటర్వ్యూలు ఈ షోలో హైలైట్‌గా నిలవనున్నాయన్న సంగతి ఆల్రెడీ ప్రోమోలతో ప్రూవ్ చేసేశారు.

దీపావళి సందర్భంగా స్టార్ట్ అయిన ఈ షోకి మొదటి కంటెస్టెంట్‌గా సీనియర్ నటుడు మోహన్ బాబు విచ్చేసి, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ముచ్చటించారు. చమత్కారంగా బాలయ్య అడిగిన ప్రశ్నలకు కాస్త ఘాటుగానే అయినా, తగ్గట్లుగా సమాధానాలు చెప్పి, తొలి షోని విజయవంతం చేసేశారు. ఇక తదుపరి ఈ షోకి విచ్చేస్తున్న సెలబ్రిటీ నేచురల్ స్టార్ నాని.

నానికి బాలయ్య అంటే, చాలా ఇష్టం. ఆ ప్రత్యేకమైన అభిమానంతోనే తను నటించిన ఓ సినిమాలో జై బాలయ్యా.. అంటూ రీల్ లైప్ ఫ్యాన్‌గా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక ఇదే అభిమానాన్నిదృష్టిలో పెట్టుకుని, బాలయ్య అడిగే ప్రశ్నలకు నాని ఎలాంటి సమాధానాలు చెబుతాడో. సహజంగానే బోలెడంత సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న నానిని, ఈ షోలో బాలయ్య తన చమత్కారాలతో ఎలా ఆటపట్టిస్తాడనే ఆసక్తి నెటిజనంలో నెలకొంది. చూడాలి మరి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles