రెమ్యునరేషన్ విషయంలో నాని అనూహ్య నిర్ణయం.. వైరల్ అవుతున్న వార్త..!

టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అష్టా చమ్మా సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన నాని.. వరుస హిట్ లతో అతి తక్కువ కాలంలోనే నాచురల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఇటీవల నాని నటించిన అంటే సుందరానికి సినిమా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాని “దసరా” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది.

ఇదిలా ఉండగా హీరోల రెమ్యూనరేషన్ విషయం ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది. నాని రెమ్యూనరేషన్ విషయం కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని సందర్భాలలో పెద్దపెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా భారీ రెమ్యూనరేషన్లు డిమాండ్ చేస్తుంటారు. ఇలా హీరోల రెమ్యునరేషన్ వల్ల నిర్మాతలకి నష్టాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొంతమంది హీరో, హీరోయిన్లు సినిమా ప్లాప్ అయితే తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వటం,లేదా తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవటం మనం చూస్తున్నాము.

నాని కూడా తను నటించబోయే సినిమాకి సగానికి సగం రెమ్యునరేషన్ తగ్గించాడని సమాచారం. ప్రస్తుతం నాని నటించబోతున్న దసరా సినిమా కోసం నాని సగం రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఒకవేళ సినిమా మంచి హిట్టయ్యి భారీ కలెక్షన్స్ వసూలు చేస్తే మిగిలిన రెమ్యునరేషన్ ఇవ్వమని నిర్మాతలకి చెప్పాడట. ప్రస్తుతం నాని తన రెమ్యునరేషన్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నాని నిర్ణయంతో దసరా సినిమా నిర్మాతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.