Nani s Dasara Glimpse : ఊహించని అవతార్ లో నాచురల్ స్టార్ నాని..”దసరా” గ్లింప్స్ చూసారా??

Nani s Dasara Glimpse : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోలు ఎంతోమంది ఉండొచ్చు కానీ.. నటన అనే పదం కోసం మాట్లాడితే చాలా తక్కువ మందే గుర్తుకొస్తారు. మరి ఈ హీరోస్ లో డెఫినెట్ గా ఉండే పేరు నాచురల్ స్టార్ నాని. తన సహజ నటనతో నాచురల్ స్టార్ అనే ట్యాగ్ ని తెచ్చుకున్న నాని హీరోగా ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.
అయితే ఈ చిత్రాల్లో రీసెంట్ గా “శ్యామ్ సింగ రాయ్” భారీ హిట్ అయ్యింది. మరి దీని తర్వాత ఇంకా కొన్ని సినిమాలు చేస్తుండగా వాటిలో పక్కా మాస్ మసాలా డ్రామాగా చేస్తున్న సినిమా “దసరా”. శ్రీకాంత్ ఓడెల తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్ వీడియోని మరియు ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
అయితే ఇందులో నాని నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో కనిపిస్తుండగా అంతకు మించిన మాస్ లో అయితే ఈ సినిమా గ్లింప్స్ టీజర్ కనిపిస్తుంది అని చెప్పాలి. సంతోష్ నారాయణన్ సాలిడ్ నేపథ్య గీతంలో ఆసక్తికర మాస్ సన్నివేశాన్ని నానిపై ఇందులో చూపించారు. అలాగే ఇందులో తన చేత్తో పట్టుకున్న బీడీని మండే మంటలో వెలిగించడం అయితే హైలైట్..
ఇక దీనితో పాటుగా ఈ సినిమా ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇలా నాని నుంచి ఈ ఊహించని గిఫ్ట్ తన ఫ్యాన్స్ కి మాస్ మీల్స్ పెట్టేలా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ వారు నిర్మాణం వహించారు.
https://www.youtube.com/watch?v=GT7th52DKj0