Ntr: సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉందని చెప్పాలి సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా నటుడుగా గుర్తింపు పొందిన ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి రాజకీయాలలోకి వెళ్లి అక్కడ కూడా మంచి గుర్తింపు పొందారు. ఇక నందమూరి తారక రామారావు తర్వాత ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అయితే తదుపరి తరంలో బాలయ్య మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇక బాలయ్య తరువాత తదుపరి తరంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి నందమూరి నాలుగో తరం ఎంట్రీ ఇచ్చింది. దివంగత నటుడు రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ మనవడు, హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ కుమారుడు తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వైవిఎస్ చౌదరి కొత్త సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి. హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమానికి సీనియర్ ఎన్టీఆర్ కూతుర్లు, కొడుకులతోపాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా హాజరై సందడి చేశారు.
కొత్త ఎన్టీఆర్, హీరోయిన్ వీణారావులపై చంద్రబాబు భార్య భువనేశ్వరి క్లాప్ కొట్టగా పురంధేశ్వరి, లోకేశ్వరి కెమెరా ఆన్ చేసారు. కొత్త ఎన్టీఆర్ కి నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ఇక ఈ పూజా కార్యక్రమంలో భాగంగా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట కనిపించటంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
