వైసీపీ తరపున పోటీ చేస్తారా.. నాగార్జున జవాబు భలే ఉందిగా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నాగార్జున సన్నిహితుడనే సంగతి తెలిసిందే. నాగార్జున జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ కామెంట్లు చేయలేదనే సంగతి తెలిసిందే. నాగార్జున సినిమాలకు సైతం ఏపీలో ఇబ్బందులు కలగలేదు. బంగార్రాజు సినిమాకు టికెట్ రేట్లు పెంచి అమ్మినా జగన్ సర్కార్ చూసీచూడనట్లుగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ నుంచి నాగార్జున పోటీ చేయనున్నారని గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

ది ఘోస్ట్ సినిమా ప్రమోషన్లలో భాగంగా వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించిన నాగార్జున ఆ వార్తలకు చెక్ పెట్టారు. నా రాజకీయ ప్రవేశం గురించి జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని నాగార్జున కామెంట్లు చేయడం గమనార్హం. పొలిటికల్ ఎంట్రీ గురించి జరుగుతున్న ప్రచారాన్ని తాను పట్టించుకోనని నాగ్ తెలిపారు. 15 సంవత్సరాల నుంచి ఈ తరహా ప్రచారం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.

తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని నాగార్జున తన కామెంట్ల ద్వారా పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చారు. నాగార్జున క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరో చూడాల్సి ఉంది. వైసీపీ ఇప్పటివరకు విజయవాడ లోక్ సభ స్థానం నుంచి గెలవలేదనే సంగతి తెలిసిందే. ఈ స్థానం విషయంలో జగన్ మనస్సులో ఎవరు ఉన్నారో క్లారిటీ రావాల్సి ఉంది.

2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానాన్ని కచ్చితంగా కైవసం చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్టు బోగట్టా. జగన్ సర్కార్ పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో గెలిచే విధంగా అడుగులు వేస్తుండటం గమనార్హం. జగన్ సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని నాగార్జున సమర్థించిన సంగతి తెలిసిందే. డైరెక్ట్ గా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా జగన్ సర్కార్ కు నాగార్జున తన వంతు పాజిటివ్ గా మాట్లాడుతూ సహాయ సహకారాలు అందిస్తున్నారు.