Nagarjuna: మనిషి నచ్చకపోవడం వల్లే తప్పులు చేశానంటూ ఒప్పుకున్న నాగార్జున!

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఆరు పదుల వయసులో కూడా ఎంతో అందంతో తన కొడుకులకు పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా తన కొడుకుతో కలిసి బంగార్రాజు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.ఇలా బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో రాజమండ్రిలో ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి మాట్లాడారు. ఇక సినీ కెరీర్లో నాగార్జునకు రాంగోపాల్ వర్మకు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన శివ, అంతం, గోవింద గోవిందా, ఆఫీసర్ వంటి చిత్రాలు మంచి పేరు తీసుకు వచ్చాయి.ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోలు వర్మను విమర్శించినా నాగార్జున మాత్రం ఎప్పుడూ వర్మపై ఎలాంటి విమర్శలు చేయలేదు అందుకు గల కారణం వీరి మధ్య ఉన్న మంచి అనుబంధమే అని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జునకు మీకెందుకు వర్మ అంత ఇష్టం అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నాగార్జున తనదైన శైలిలో సమాధానం చెప్పారు. వర్మ డైరెక్టర్ కాకముందే నాకు ఒక మంచి స్నేహితుడని నాతోనే ఆయన కెరీర్ ప్రారంభం అయిందని ఈ సందర్భంగా వర్మతో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు.అదేవిధంగా నాగార్జున తన కెరియర్ లో చేసిన కొన్ని తప్పులు గురించి కూడా బహిరంగంగా తెలియజేశారు.

నేను ఏదైనా ఒక సినిమా చేయాలంటే తప్పకుండా ఆ సినిమా కథ నచ్చడమే కాకుండా మనిషి కూడా నచ్చాలని ఇలా మనిషి నచ్చక ఎన్నో మంచి సినిమాలను కూడా వదులుకున్నానని నా కెరీర్లో నేను ఇలాంటి తప్పులు చేశానని నాగార్జున బహిరంగంగా తాను చేసిన తప్పుల గురించి తెలియజేశారు. బంగార్రాజు సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నాగార్జున తరవాతి ప్రాజెక్ట్ ఘోస్ట్ సినిమాపై పూర్తిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.