మా ఎన్నికల్లో ‘మెగా’ కొంప ముంచేసిన నాగబాబు.!

మెగా కాంపౌండ్ అంటే.. అందులో చాలామంది వున్నారు. చిరంజీవి నుంచి అల్లు శిరీష్ దాకా చాలామంది హీరోలున్నారు. అంతేనా, నిహారిక రూపంలో ఓ నటి కూడా వుంది. అయినా, ‘మా’ ఎన్నికల్లో చిరంజీవి క్యాంప్ ఓడిపోవడమేంటి.?

వాస్తవానికి చిరంజీవి క్యాంప్.. అనే పేరుతో ప్రకాష్ రాజ్ క్యాంప్ హైలైట్ అయ్యింది తప్ప, ఎక్కడా చిరంజీవి బాహాటంగా ఎవరికీ మద్దతు పలకలేదు. ‘మౌనం అర్థాంగీకారం అవుతుంది’ గనుక, ప్రకాష్ రాజ్ అంటే చిరంజీవి మనిషే.. అని పదే పదే నాగబాబు చెప్పినా, చిరంజీవి ఖండించకపోవడం చూస్తే.. నో డౌట్, ప్రకాష్ రాజ్ వెనుక చిరంజీవి వున్నట్టే లెక్క.

ఎప్పుడైతే కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటుడి మీద నాగబాబు మాటల దాడి చేశారో, అది కూడా ప్రకాష్ రాజ్ క్యాంప్ పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యింది. అలాగని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులంతా ఓడిపోలేదు, కొందరు గెలిచారు. కానీ, పూర్తి నెగెటివిటీని ప్రకాష్ రాజ్ ఎదుర్కొన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో ప్రకాష్ రాజ్ అసమర్థత కంటే, నాగబాబు చేసిన అతి.. పూర్తిస్థాయి నెగెటివిటీకి కారణమయ్యింది. ఓటర్లను మెప్పించడం కంటే, నెగెటివ్ ఓట్లు వేసేందుకు సభ్యులు ఎగబడ్డారంటే, నాగబాబు పైత్యమే దానికి కారణం.

నాగబాబు చాలా సులువుగా ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. మరి, చిరంజీవి పరిస్థితేంటి.? చిరంజీవి పెద్దరికం నాగబాబు కారణంగా నాశనమయ్యిందిప్పుడు.