మెగా సోదరుడు, సినీ నటుడు నాగబాబు తాజాగా తన సోదరుడు చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు. తాజాగా విజయనగరం జిల్లాల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న నాగబాబు ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని అన్నాడు.
ఇప్పుడు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి చిరంజీవి మద్దతుగా ఉంటారు తప్ప పోటీచేయరని క్లారిటీ ఇచ్చాడు. పొత్తులపై అన్ని ఆలోచించి జనసేన అధినేత పవన్ నిర్ణయం తీసుకుంటారని.. జిల్లాలో పార్టీ పరిస్థితి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్టుగా తెలిపాడు. మొత్తానికి చిరంజీవి ఇక సినిమాలకే పరిమితం అని రాజకీయం రీ ఎంట్రీ ఉండదని క్లియర్ గా అర్థమవుతుంది.