Samantha: సమంతకు భారీ భరణం ఆఫర్ చేసిన చైతూ…. అక్కినేని అహం పై దెబ్బ కొట్టిన సామ్!

Samantha: గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఏం మాయ చేసావే ఈ చిత్రం ద్వారా సమంత నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. సమంతకు మొదటి సినిమా కావటం విశేషం ఇలా మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న సమంత అనంతరం తిరిగి నాగచైతన్యతో కలిసి పని సినిమాలలో నటించారు. ఇతరుణంలోనే ఆమె నాగచైతన్య ప్రేమలో పడ్డారు.

ఇలా నాగచైతన్యత ప్రేమలో ఉన్న సమంత పెద్దల సమక్షంలో 2017 అక్టోబర్ నెలలో వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు. అయితే మూడు సంవత్సరాల పాటు వీరు వారి వైవాహక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా 2021 వ సంవత్సరంలో విడాకులు తీసుకొని విడిపోయారు.. వీరి విడాకుల విషయాన్ని అధికారకంగా కూడా ప్రకటించారు.

ఇలా సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయే సమయంలో నాగచైతన్య ఆమెకు భారీ స్థాయిలోనే భరణం ఆఫర్ చేశారట నాగ చైతన్యకు ఇటు తల్లి నుంచి అలాగే తండ్రి తరఫునుంచి భారీ స్థాయిలో ఆస్తులు వస్తాయి ఈ క్రమంలోనే సమంతకు ఏకంగా 200 కోట్ల రూపాయల భరణం ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.

ఇలా నాగచైతన్య ఈ స్థాయిలో ఆమెకు భరణం ఆఫర్ చేసినప్పటికీ సమంత మాత్రం తాను కష్టపడుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి వచ్చిన అమ్మాయిని తనకు చైతన్య ఇచ్చే భరణం ఏ మాత్రం అవసరం లేదు అంటూ రూపాయి కూడా తీసుకోలేదట. సమంత నిర్ణయం ఒకింత అక్కినేని ఫ్యామిలీ అహాన్ని దెబ్బతీసిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు.

ఇలా సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత నాగచైతనే తిరిగి శోభితను రెండవ వివాహం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో అతి కొద్దిమంది సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇక సమంత కూడా ప్రముఖ డైరెక్టర్ ప్రేమలో ఉన్నారని త్వరలోనే ఈమె కూడా వారి ప్రేమ గురించి బయట పెట్టనున్నారని తెలుస్తుంది.