Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య తన భార్య శోభిత గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత తిరిగి శోభితను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన వైవాహిక జీవితం గురించి కూడా నాగచైతన్య మాట్లాడారు. ప్రస్తుతం నేను తన వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఇక శోభిత నేను ఇద్దరం తెలుగు వాళ్ళు కావడంతో ఇద్దరికీ కూడా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అంటే చాలా గౌరవం అని తెలిపారు. ఇక శోభిత తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది నేను తెలుగు మాట్లాడటంలో ఆమె సహాయం తీసుకుంటానని తెలిపారు.
ఇక ఏదైనా ఒక స్పీచ్ ఇవ్వాల్సిన సమయంలో శోభిత తనకు సహాయం చేస్తుందని నాగచైతన్య వెల్లడించారు. ఇక నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే తప్పనిసరిగా శోభిత సలహా తీసుకుంటానని ఆమె సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటానని నాగచైతన్య తెలిపారు. ఇక శోభిత నటించిన సినిమాల గురించి కూడా నాగచైతన్య మాట్లాడుతూ ఆమె నటించిన మేజర్, మేడ్ ఇన్ హెవెన్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టమని తెలియజేశారు.
ఇక శోభిత నాగచైతన్య వివాహం 2024 డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి ఎంతో సాంప్రదాయపద్ధంగా జరిగింది. ఇక ఈ పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లను శోభిత డిజైన్ చేశారని చైతన్య వెల్లడించారు.