Nagachaitanya: నాకు అసలైన బుజ్జి తల్లి శోభితనే…. ఈ పాట తనకే అంకితం: చైతన్య

Nagachaitanya: నాగచైతన్య తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఫిబ్రవరి 7వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తండేల్ జాతర పేరుతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా చిత్ర బృందం మీడియా సమావేశంలో నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు నిర్మాత దిల్ రాజు అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు యాంకర్ సుమ చిత్ర బృందంతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే నాగచైతన్యతో మాట్లాడుతున్న సమయంలో స్టేజ్ పైన శోభిత నాగచైతన్య పెళ్లికి సంబంధించిన ఒక ఫోటోని వేయించారు. ఇక ఈ ఫోటోను చూపిస్తూ మీరు కనుక శోభిత గారికి ఏదైనా ఒక సాంగ్ లేదా ఒక డైలాగ్ డెడికేట్ చేయాలంటే ఏది చేస్తారు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు నాగచైతన్య మాట్లాడుతూ బుజ్జి తల్లి సాంగ్ తనకే డెడికేట్ చేస్తానని తెలిపారు . నిజానికి నేను ఇంట్లో తనని బుజ్జి తల్లి అంటూ పిలుస్తానని ఈ విషయం చందూకి కూడా తెలుసు అంటూ తెలిపారు. అంతలోనే డైరెక్టర్ చందు కల్పించుకొని అవును నాకు సినిమా షూటింగ్ కి ముందే ఇలా చెప్పడంతో నేను కూడా ఆశ్చర్యపోయానని తెలిపారు. అలాగే తన పెళ్లి రోజున కూడా నేను వెళ్లడంతో శోభిత నాతో ఒకటే మాట అన్నారు.

బుజ్జి తల్లి అనే పేరును సరే సినిమా వరకు ఓకే అనుకుంటే పాట కూడా పాడేశారా అని ఆమె అన్నారని చెందూ చెప్పుకొచ్చారు. దానికి నాగచైతన్య
మాట్లాడుతూ ఈ పాట విడుదల అయిన తర్వాత తాను చాలా ఫీల్ అయిందని తెలిపారు. ఆమె బుజ్జి తల్లి అనేది తన సిగ్నేచర్ లాగా ఫీల్ అయ్యేది. దాన్ని నేను ఎలా సినిమాల్లో వాడేస్తా అంటూ ఆవిడ ఫీల్ అయిందని నాగచైతన్య తెలియచేశారు. ఇక ఈ సినిమాలో బుజ్జి తల్లి అంటూ పోయే సాంగ్ ఎంతలా ఫేమస్ అయిందో మనకు తెలిసిందే.