Naga Chaithanya: ఆ విషయంలో బన్నీకి పోటీగా రంగంలోకి దిగిన నాగచైతన్య!

Naga Chaithanya: లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో హిట్ కొట్టిన నాగ చైతన్య విడాకుల తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. విభిన్నమైన కథలు ఎంచుకుంటున్న చైతు,అమీర్ ఖాన్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కూడా నటిస్తున్నాడు. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా బిజీ బిజీగా ఉన్నాడు.ఇలా వరుస సినిమాలతోనే కాకుండా యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. నాగచైతన్య ఇప్పటికే కొన్ని యాడ్స్ లో నటించాడు.

తెలుగు హీరోలు ఇప్పటికే చాలామంది పలు యాడ్స్ లో నటించారు. ఇటీవల బన్నీ జొమాటో ఆన్ లైన్ ఫుడ్ యాప్ లో నటించిన సంగతి తెలిసినదే, కాగా బన్నీకి పోటీగా నాగ చైతన్య ఆన్‌లైన్‌లో ఫుడ్ యాప్ అయిన స్విగ్గి కమర్షియల్ యాడ్‌లో నటించాడు. దీనికి సంబదించిన వీడియోను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసి అభిమానుల్లో ఉత్సహం నింపాడు. ఈ విధంగా బన్నీ జొమాటో ఆడ్ చేయగా నాగ చైతన్య స్విగ్గి ప్రమోట్ చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే నాగ చైతన్య,దిల్ రాజు సమర్పణలో విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో థాంక్యూ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు,ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది అదేవిధంగా అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే దూత్ అనే వెబ్ సైట్ ద్వారా నెగిటివ్ పాత్రలో నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు రానున్నారు.