రెండూ భాషలలో విడుదల కానున్న నాగచైతన్య ‘దూత ‘ వెబ్ సిరీస్..?

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కే. కుమార్ దర్శకత్వంలో జరిగేకిన థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సమంత నుండి విడిపోయిన తర్వాత నాగచైతన్య వరస సినిమాలు నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉన్నాడు. అయితే నాగచైతన్య ఇలా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా డిజిటల్ స్క్రీన్ మీద కూడా తన సత్తా నిరూపించుకోనున్నాడు.

ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ నాగచైతన్య బిజీగా ఉన్నాడు. నాగచైతన్య నటిస్తున్న దూత అనే వెబ్ సిరీస్ నుండి తాజగా ఒక క్రేజీ అప్సెట్ వచ్చింది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ని తెలుగు తో పాటు తమిళ భాషలో కూడా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య ఒక డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకులకు కనిపించనున్నాడు. ఈ వెబ్ సిరీస్ ద్వారా నాగచైతన్య ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాడని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. తొందర్లోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

ఇదిలా ఉండగా థాంక్యూ సినిమా ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నాగచైతన్య మూడు పాత్రలలో నటించాడని తెలుస్తోంది. ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య , రాశి కన్నా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి మాత్రమే కాకుండా పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి మనం వంటి ఒక సూపర్ హిట్ సినిమాని అందించిన విక్రమ్ కె. కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం చేయటంతో అభిమానులు ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్నారు.