ఇండస్ట్రీకి ఇదే నా రిక్వెస్ట్.. అభిజిత్‌కు అండగా నాగబాబు

Naga babu About Abhijeet Movie Offers

బిగ్ బాస్ షోలో ఫినాలె ఎపిసోడ్ కాస్త వింతగా కొత్తగా జరిగింది. టైటిల్ విజేతగా అభిజిత్ నిలిచినా కూడా అందరూ సోహెల్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 25 లక్షల డబ్బును తీసుకుని.. అందరి దృష్టిని ఆకర్షించాడు. అదో కారణం అయితే ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి సోహెల్‌ను ఆకాశానికెత్తేశాడు.వరాల జల్లు కురిపించాడు. ఇంటి నుంచి మటన్ తీసుకొచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. అలా విన్నర్‌గా నిలిచిన అభిజిత్‌కు సరైన గుర్తింపు దక్కనివ్వలేదనే టాక్ వచ్చింది.

Naga babu About Abhijeet Movie Offers
Naga babu About Abhijeet Movie Offers

అయితే చిరంజీవి సోహెల్‌కు అండగా ఉంటే.. అభిజిత్‌కు మెగా బ్రదర్ నాగబాబు అండగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అభిజిత్‌కు నాగబాబు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. అతను గెలుస్తాడని, గెలవాలని కోరుకుంటున్నాని తెలిపాడు. తాజాగా అభిజిత్‌తో కలిసి కాసేపు ముచ్చటించిన నాగబాబు అతడి కెరీర్ గురించి బాగానే శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తోంది. అతను చాలా ఇంటెన్స్ ఉన్న యాక్టర్ అవుతాడని నాగబాబు చెప్పుకొచ్చాడు.

అలాంటి వ్యక్తికి ఇండస్ట్రీ అండగా ఉండాలని కోరుకున్నాడు. అలాంటి వారిని ఎంకరేజ్ చేయాలని నాగబాబు చెప్పుకొచ్చాడు. తనకు తెలిసిన వారందరికీ కూడా చెబుతున్నాను.. అవకాశాలు ఇవ్వమని అడుగుతున్నాను అని చెప్పుకొచ్చాడు. అలాంటి వారిని వాడుకోవాలని ఇండస్ట్రీకి ఇదే నా రిక్వెస్ట్ అంటూ నాగబాబు అందరినీ కోరాడు. మొత్తానికి అభిజిత్‌కు అండగా నాగబాబు నిలబడ్డట్టు కనిపిస్తున్నాడు.