Kalki 2: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం కల్కి. ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపుగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీని మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ గా రూపొందించారు. మైథలాజికల్ అంశాలకు, సైన్స్ ఫిక్షన్ జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించారు.
సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ చేశారు. అయితే ఇప్పటికే విడుదలైన పార్ట్ వన్ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 ఫై దృష్టి సారించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. డార్లింగ్ అభిమానులు ఈ సినిమా పార్ట్ 2 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ పార్ట్ 2 కి సంబంధించిన అప్డేట్ ల కోసం ఇంకా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. అయితే ఈ సినిమా విడుదల కావడానికి మరొక ఏడాది సమయం పట్టి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఉంటే తాజాగా కల్కి 2 పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ఈ మేరకు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..
కల్కి 2 సినిమాలో పాండవులు ఉండరు. ప్రస్తుతంలో పాండవుల పాత్రలు కూడా కనిపించవు. కాకపోతే కురుక్షేత్రానికి సంబంధించిన సీన్లు ఉంటాయి అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం రివీల్ చేశాడు నాగ్ అశ్విన్. కృష్ణుడి పాత్ర గురించి రియాక్ట్ అయ్యారు. ఆ పాత్రలో మహేష్ బాబు నటిస్తే అదిరిపోయేదని, ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసేవారని, సినిమా రెండు వేల కోట్లు వసూలు చేసేదన్నారు నాగ్ అశ్విన్. కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై ఆయన స్పందించారు. కల్కిగా కొత్త ఫేస్ ఉంటుందని వెల్లడించారు. నోటెడ్ వాళ్లు కాకుండా, సినిమాల్లో నటిస్తున్న వాళ్లు కాకుండా కొత్త యాక్టర్ ని కల్కిగా చూపించబోతున్నట్టు తెలిపారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం కల్కి 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు కల్కి 2 సినిమా గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక్కొక్క అప్డేట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.