Poonam Pandey: బాలీవుడ్ బ్యూటీ, శృంగార తార పూనమ్ పాండే వైవాహిక జీవితం గురించి మనందరికీ తెలిసిందే. ఈమె 2020లో సామ్ బాంబే అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ ఆమె వైవాహిక జీవితం మూడునాళ్ళ ముచ్చటగానే ముగిసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పెళ్లి తర్వాత తాను అనుభవించిన కష్టాల గురించి చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. పెళ్లి తర్వాత ఆమె భర్త తనను టార్చర్ చేశాడని, అలాంటి జీవితం మరే అమ్మాయికి రాకూడదు అంటూ భావోద్వేగానికి లోనయ్యింది.
ఆమె అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె జీవితంలో దారుణ ఘటనలు జరగడం తన దురదృష్టమని ఆమె తెలిపింది. ఇక పెళ్లి తర్వాత తను భర్త నుంచి విడిపోయానని, ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటున్నట్లు తెలిపింది. అంతే కాకుండా తాను ప్రస్తుతం ఏ భాగస్వామి తోడు కోరుకోవడం లేదని తెలిపింది. ఆమె గతంలో తనను భర్త కొడుతున్నాడు అని గృహహింస కేసు పెట్టిన విషయం తెలిసిందే. తన భర్త తనని కొట్టి హింసించడమే కాకుండా,తనను హత్య చేసినంత పని చేశాడని తెలిపింది.