Vijay sai Reddy: విజయ్ సాయి రెడ్డిని వరించబోతున్న కీలక పదవి….అందుకే రాజీనామా?

Vijay sai Reddy: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఊహించని విధంగా రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే ఇలా ఈయన చేసిన ఈ రాజీనామాకు గల కారణం ఏంటి అనే విషయాలను కూడా ఆయన తెలియజేశారు. తాను ఎవరి ప్రమేయం లేకుండా రాజీనామా చేశానని నా ఇష్టపూర్వకంగానే రాజీనామా చేసానని తెలిపారు. తాను ఇకపై ఎలాంటి రాజకీయ పార్టీలలోకి వెళ్లనని పూర్తిగా రాజకీయాలకు దూరం అవుతూ వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభం అయినటువంటి విజయసాయిరెడ్డి ఉన్నఫలంగా జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటకు వెళ్లడంతో ఈయన రాజీనామా వెనుక ఏదో పెద్ద స్కెచ్ ఉందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు ఇలా లండన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా గురించి మాట్లాడుతూ జగన్ వద్దని చెప్పినా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చివరికి రాజీనామాని ప్రకటించారు.

ఇలా రాజీనామా చేసిన విజయ్ సాయి రెడ్డి త్వరలోనే బిజెపి పార్టీలోకి వెళ్తారని అందరూ భావిస్తున్నారు. ఇటీవల అమిత్ షా తో బేటి అయిన తరువాత విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. కానీ ఆయన మాత్రం తాను ఏ పార్టీలోకి వెళ్లే ప్రసక్తి లేదని తెలిపారు. దీంతో బీజేపీ ఈయనకు ఒక కీలకమైన పదవిని కట్టబెట్టడానికి సిద్ధంగా ఉందని త్వరలోనే ఆ పదవి గురించి బహిరంగంగా తెలియచేయబోతున్నారని తెలుస్తుంది.

విజయసాయిరెడ్డి తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని తెలిపారు. అందుకే ఈయన ఏ పార్టీలో చేరకుండా తనని గవర్నర్ పదవిలో కూర్చోబెట్టాలని ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తుంది.గవర్నర్ గిరీ అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా హుందాగా ఉండవచ్చని, తనకు ఉన్న ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకునే అవకాశముందని కూడా ఆయన భావిస్తున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే ఈయనని గవర్నర్ గా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయబోతున్నారని సమాచారం.