Kranthi Balivaada: సీరియల్ షూటింగ్ ఉన్నప్పుడు మనకు ఎలా ఉన్నా కూడా వెళ్లాల్సి ఉంటుందని ఆర్టిస్ట్ క్రాంతి బలివాడ తెలిపారు. మనకు ఒంట్లో బాగోలేకపోయినా కూడా వెళ్లాలి వెళ్లాలి అని ఆమె అన్నారు. ఒక రెండు, మూడు రోజులు అయితే ఆపగలరు. కానీ ఎక్కువ రోజులు అయితే వాళ్లు కూడా ఏం చేయలేరు కదా అని క్రాంతి తెలిపారు.
ఒకసారి తన బాబు ఎనిమిది నెలల వయసులో ఉన్నప్పుడు వైరల్ ఫీవర్ వచ్చిందని, ఆ సమయంలో కూడా తనని డే కేర్ లో పెట్టి షూట్ కి వెళ్లాల్సిన సందర్భం అని క్రాంతి బలివాడ ఆవేదన వ్యక్తం చేశారు. అది తనకు చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని ఆమె అన్నారు. ఒకవేళ తొందరగా వెళ్దాం అనుకున్నా కూడా వాళ్లు పంపించ లేకపోయారని ఆమె తెలిపారు. అది వాళ్ల చేతిలో కూడా ఉండదని, కొంతవరకు చేయగలరు కానీ ప్రతి సీన్ లో తాను ఉన్నానని, ఆ షూటింగ్ ఫిలింసిటీలో చేశామని, తనను రాత్రి 8 గంటలకు పంపించారని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె ఇంటికి వచ్చేసరికి 9:30 అయ్యిందని, తన భర్త 6 గంటలకు వెళ్లి తన బాబుని పికప్ చేసుకుని వచ్చారని ఆమె చెప్పారు. అంటే డే కేర్ లో దాదాపు అప్పటివరకు బాబుని అలా ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారని ఆమె అన్నారు. ఇలాంటి సిచువేషన్ లో అనిపిస్తూ ఉంటుంది అసలు ఏంటి మనమేం చేస్తున్నామని కానీ దాన్ని మనం ఏమి చేయలేము అని ఆమె స్పష్టం చేశారు.
కొన్ని ఇలాంటి సిచువేషన్ వచ్చినప్పుడే తను ఇండస్ట్రీలోకి వచ్చి ఉండాల్సింది కాదేమో అని ఫీల్ అయి ఉంటానని క్రాంతి బలివాడ తెలిపారు. ఎందుకంటే ఏదైనా జాబ్ చేసి ఉంటే లీవ్ తీసుకుంటాం కదా అని అనిపిస్తుందని, కానీ ఇక్కడయితే కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేని సందర్భమది అని ఆమె తెలిపారు. ఎందుకంటే తనకు కాంబినేషన్లో ఆ యాక్టర్స్ మళ్లీ దొరకరు కదా అని ఆమె అన్నారు.