రెండు పెద్ద సినిమాలు ఒకేసారి వస్తే బాక్సాఫీస్ వద్ద ఏదో ఒక సినిమాపై ప్రభావం అయితే పడుతుంది. అయితే ఈ కాలంలో మాత్రం స్టార్ ఇమేక్ కన్నా కూడా కంటెంట్ చాలా ముఖ్యమైనది. ఇక ఇప్పుడు భోళా శంకర్ జైలర్ ఒకేసారి రాబోతున్నాయి. రెండిటిలో ఏది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఆసక్తిగా మారుతుంది.
భోళా శంకర్ సినిమాపై హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో తప్పితే మిగతా ఆడియన్స్ లో పెద్దగా అంచనాలు లేవు. రీమేక్ సినిమా అని రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనే ముద్రతో పాటు శక్తి షాడో లాంటి సినిమాలు చేసిన మెహర్ రమేష్ కావడంతో సినిమాకు పెద్దగా అంచనాలు అయితే లేవు.
అయితే వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కు ముందు కూడా ఇలాంటి నెగటివ్ టాక్ ఉన్నదే. కానీ మెగా బాస్ తన కమర్షియల్ పాయింట్ తోనే బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు భోళా శంకర్ రొటీన్ కంటెంట్ తో ఉంటే మాత్రం జైలర్ కు మంచి అవకాశం అని చెప్పవచ్చు. జైలర్ కాస్త రొటీన్ కు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాలో త్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అంటున్నారు.
ట్రైలర్ కూడా అలానే ఆకట్టుకుంది. కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా కూడా భోళా శంకర్ ప్రభావం కూడా ఈ సినిమాపై పెద్దగా పడదు. పైగా ఇది కాస్త డిఫరెంట్ గా ఉంది అని ఆడియన్స్ ఎక్కువ స్థాయిలో ఇటువైపు మొగ్గు చూపించే అవకాశం అయితే ఉంది. మరి జైలర్ తో రజనీకాంత్ ఇంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. నెల్సన్ దిలీప్ కూడా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సన్ పిక్చర్స్ నిర్మించింది.