ముసలమ్మల చాదస్తంగా మాట్లాడుతూ.. ఫన్నీ వీడియో చేసిన సుమ.. వీడియో వైరల్?

ఎన్నో ఏళ్లుగా బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన వారిలో సుమా కనకాల కూడా ఒకరు. బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోస్ లో యాంకర్ గా వ్యవహరించిన సుమ బుల్లితెర మహారాణిగా గుర్తింపు పొందింది. ఎంతోమంది కొత్త యాంకర్లు ఇండస్ట్రీకి వచ్చి తమ గ్లామర్ తో సందడి చేస్తున్నప్పటికీ సుమకి పోటీగా నిలవలేక పోతున్నారు. టీవీ షోలు, సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, సినిమాలు అంటూ ఎక్కడ చూసినా సుమా సందడే కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సందడి చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.

కరోనా సమయంలో ఇంటిపట్టునే ఉన్న సుమ కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఆ చానల్ ద్వారా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా సుమ పన్నీ రీల్స్, కుకింగ్ వీడియోస్ అండ్ ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా గత కొంతకాలంగా బిహైండ్ ద సీన్స్ అంటూ తన మేకప్ వీడియోలు, ఫోటో షూట్ వీడియోలు, షూటింగ్ సమయంలో బ్యాక్ స్టేజ్ లో వారు ఎలా సందడి చేస్తారో అన్ని విషయాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

అంతే కాకుండా షూటింగ్ మధ్యలో బ్రేక్ సమయంలో వారు ఏం చేస్తారో అన్ని విషయాలు వివరిస్తూ వీడియోలు షేర్ చేస్తుంది. ఇటీవల న్యూయార్క్ లో చాలారోజులు వెకేషన్ ఎంజాయ్ చేసిన సుమ అక్కడ న్యూయార్క్ వీదుల్లో డాన్స్ చేస్తూ సందడి చేసింది. అంతే కాకుండా అక్కడ రెస్టారెంట్ లకి వెళ్ళి వెరైటీ ఫుడ్ ఐటమ్స్ తింటూ ఎంజాయ్ చేయటమే కాకుండా అక్కడి రెస్టారెంట్లలో ఉన్న రోజు సర్వర్ లను కూడా తన అభిమానులకు పరిచయం చేసింది. బుల్లితెర మీద సుమ సందడి కొంచెం తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా రచ్చ చేస్తుంది. ఈ క్రమంలో సుమ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ వీడియోలో సుమ ముసలివారీ చాదస్తం ఎలా ఉంటుందో అందరికీ వీడియో చేసి చూపించింది. జీవితంలో తన ఎక్స్పీరియన్స్ తో ముసలివారు ఎలా చాదస్తంగా ప్రవర్తిస్తారు చూపించడానికి సుమా ముసలావిడలా గెటప్ వేసుకొని దర్శనం ఇచ్చింది. వయసు పెరిగే కొద్దీ మనుషులు ఎలా మాట్లాడతారు.. వారి చాదస్తం ఎలా ఉంటుంది అన్న విషయం గురించి ఓ సంభాషణను సుమ చూపించింది. ఈ వీడియో లో సుమ రెండు వేరియేషన్స్‌లో కనిపించింది. ప్రస్తుతం సుమ షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియో అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది.