ఐపీఎల్-2020: మారని కోలకతా రాత , నెం.1 ప్లేస్ లో ముంబై

mumbai won against on kolkata

అబుదాబి :ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ మారినా.. ఆ జట్టు రాత మాత్రం మారలేదు. తాజా సీజన్‌ లీగ్ దశలో ముంబయి ఇండియన్స్ చేతిలో వరుసగా రెండోసారి కూడా ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది. అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ (53 నాటౌట్: 36 బంతుల్లో 5×4, 2×6) హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. ఛేదనలో ఓపెనర్ డికాక్ (78 నాటౌట్: 44 బంతుల్లో 9×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ముంబయి టీమ్ 16.5 ఓవర్లలోనే 149/2తో అలవోక విజయాన్ని అందుకుంది. ఎనిమిదో మ్యాచ్ ఆడిన ముంబయి ఆరో గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. నాలుగో ఓటమితో కోల్‌కతా నాలుగో స్థానానికి పరిమితమైంది. ముంబయితో మ్యాచ్‌కి కొన్ని గంట ముందు కోల్‌కతా కెప్టెన్సీ నుంచి దినేశ్ కార్తీక్ తప్పుకోగా.. ఇయాన్ మోర్గాన్‌ పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే.

mumbai won against on kolkata
mumbai won against on kolkata

149 పరుగుల లక్ష్యఛేదనని రోహిత్ శర్మ (35: 36 బంతుల్లో 5×4, 1×6)తో కలిసి ఆరంభించిన డికాక్.. తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడేశాడు. స్పిన్నర్లు, పేసర్లు అని తేడా లేకుండా భారీ షాట్లతో ఈ ఓపెనర్ విరుచుకుపడటంతో.. ముంబయి స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్.. తొలి వికెట్‌కి రోహిత్ శర్మతో కలిసి 10.3 ఓవర్లలోనే 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ దశలో రోహిత్ శర్మ ఔటవగా.. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (10) స్పిన్నర్ చక్రవర్తి బౌలింగ్‌లో అడ్డంగా బ్యాట్ ఊపేసి బౌల్డయ్యాడు. కానీ.. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య (21 నాటౌట్: 11 బంతుల్లో 3×4,1×6).. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన పాట్ కమిన్స్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదేశాడు. దాంతో.. మ్యాచ్ పూర్తిగా ముంబయి చేతుల్లోకి వచ్చేయగా.. 17వ ఓవర్‌ వేసిన క్రిస్ గ్రీన్ బౌలింగ్‌లోనూ ఒక బౌండరీ బాదిన హార్దిక్.. వెంటనే సింగిల్‌తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.