మిస్టర్ నందమూరి బాలకృష్ణ … ఉన్నారా నిద్రపోతున్నారా ?

balakrishna telugu rajyam

 సినిమాల్లో ఎప్పుడు హై ఓల్టేజ్ యాక్షన్ రోల్స్ పోషించే హిందూపూర్ ఎమ్మెల్యే , ప్రస్తుత టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ పార్టీ పరంగా మాత్రం ఎప్పుడు పెద్దగా యాక్టీవ్ రోల్ పోషించలేదనే చెప్పాలి. గత పదేళ్ల నుండి ఆయన పార్టీ పరంగా కొద్దోగొప్పో కనిపిస్తున్నారు తప్పితే, గతంలో పార్టీ వేరు..మేము వేరు అన్నట్లు తన సినిమాలు ఏవో తాను చేసుకుంటూ ఉండేవాడు. ఇక హిందూపూర్ ఎమ్మెల్యేగా ఎలాగోలా బండి నడిపిస్తూ తన వ్యాపకాలు తాను చేసుకుంటూ వెళ్తున్న బాలయ్యకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది.

balakrishna

 ఒకరికి ఇద్దరు అల్లుళ్లు టీడీపీలో కొనసాగుతున్నారు, ఒకరేమో టీడీపీకి కాబోయే పార్టీ నాయకుడు లోకేష్, మరొకరు టీడీపీ తరుపున గత ఎన్నికల్లో విశాఖ లోక్ సభ నుండి పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయినా భరత్ . ఇప్పుడు ఈ ఇద్దరాళ్ళుల్లు పెద్ద చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తుంది. గతంలో ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్ మెడకు ఫైబర్ గ్రిడ్ కుంభకోణం చుట్టుకోబోతుందని, అచ్చెన్న తర్వాత టీడీపీ నుండి జైలుకు వెళ్ళేది లోకేష్ అనే ప్రచారం ఒక వైపు సాగుతుండగా, గీతం యూనివర్సిటీలో ఆక్రమణలను వైసీపీ ప్రభుత్వం బయటపెట్టటమే కాకుండా, నలభై ఎకరాలను ఆక్రమించారని కూల్చివేతలను ప్రారంభించింది. దీనికి బాలయ్య చిన్నల్లుడు భరత్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ రెండు సంఘటనలు చూస్తే వైసీపీ సర్కార్ కు బాలయ్య ఇద్దరి అల్లుళ్ళు టార్గెట్ అయినట్లు సృష్టంగా తెలుస్తుంది.

Sri Bharat Lokesh

 ఇదే సమయంలో హిందూపురంలో కూడా బాలయ్య మీద వ్యతిరేకత వస్తుందని, గతంలో అధికారం ఉండటంతో పీఏ పరిపాలన చేసిన కానీ చెల్లింది కానీ, నేడు అలాంటి వ్యవహారాలు అక్కడ నడవటం లేదు, ఇలాంటి సమయంలో బాలయ్య కనీసం హిందూపూర్ వైపు కన్నెత్తి చూడటం లేదనే మాటలు వినిపిస్తున్నాయి, ఇదే అదునుగా వైసీపీ అక్కడ పుంజుకొని బాలయ్య చెక్ పెట్టాలని చూస్తుంది. రాయలసీమలో బాలయ్యను, అమరావతిలో నారా లోకేష్ ను , విశాఖలో భరత్ ను వైసీపీ ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం టార్గెట్ చేస్తున్న కానీ నట సింహం మాత్రం ఏమి మాట్లాడటం లేదు.

 తన రాజకీయ జీవితం గురించి బాలయ్య పట్టించుకోకపోయినా కనీసం అల్లుళ్ల విషయంలో అయినా మీడియా ముందుకు వస్తాడేమో అనుకుంటే బాలయ్య మాత్రం తన తర్వాతి సినిమాలకు హీరోయిన్స్ కోసం,తనకు సరిగ్గా నప్పే విగ్గుల కోసం (గత సినిమాలో విగ్గు సరిగ్గా కుదరలేదనే మాటలు వినవచ్చాయిలే) వేట కొనసాగిస్తున్నాడు. అల్లుళ్ళు ఇలా ఇబ్బందులు పడుతుంటే మామ మొఖానికి మేకప్ వేసుకోవటం ఏమైనా భావ్యమా..?