శ్రీకాకుళంలో దళితుడిపై జరిగిన ఘటన కావొచ్చు..ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో వర ప్రసాద్ పై జరిగిన దాడి కావొచ్చు! కారణం ఏదైనా? ప్రజల్లోకి జగన్ చెడుగా వెళ్తున్నారు. ఆయన కిందనున్న శాఖల తీరు ఎలా ఉందన్నది చోటు చేసుకుంటోన్న పరిస్థితులను బట్టి స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రజలకి ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి కూడా ప్లేట్ ఫిరాయించారని పలువురి ఆరోపణ. తప్పు నాది కాదు…పోలీసోళ్లదే అంటూ వాళ్ల మీదకే తొసేసారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు చూస్తే దాని వెనుక వైసీపీ నేతలు ఉన్నారు అన్నది వాస్తవం. దాదాపు 90 శాతం కేసుల్లో వైసీపీ వాళ్లు వెనుకున్నట్లు రికార్డుల్లో ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఆ నేతలు తప్పుకుని పోలీసు శాఖకు చెందిన వారు ఇక్కడ అడ్డంగా బుక్కవుతున్నారు. తమకున్న రాజకీయ పలుకబడి ఉపయోగించుకోవడం వల్లే ఇలా జరుగుతుందని కొంత మంది పోలీసుల వాదన. మరి వీటన్నింటికి బధులు చెప్పాల్సింది ఎవరంటే? కచ్చితంగా ప్రభుత్వమే. చెప్పే మాటలకు..చేసే పనులకు పొంతన కుదరడం లేదని కొంత మంది గట్టిగానే స్వరం వినిపిస్తున్నారు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో దౌర్జన్యం ఎక్కువగానే ఉందని మొదటి నుంచి వినిపిస్తోంది. ఆ సాకు చూసుకునే వైసీపీ ది రౌడీల పాలన అంటూ పచ్చ తమ్ముళ్లు సందు దొరికనప్పుడల్లా విమర్శించడం పనిగా పెట్టుకుంటోన్న సంగతి తెలిసిందే.