Mr Collector : నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ రోజు నితిన్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి ఓ టీజర్ రిలీజ్ చేశారు.
కత్తి పట్టుకుని ఓ ప్రత్యర్థి వర్గాన్ని వరుసగా నరుక్కుంటూ పోతున్నాడు నితిన్. అయితే వాళ్లు ప్రత్యర్ధులేనా.? లేక ఇంకెవరు.? అనేది తెలీదు కానీ, టీజర్ మొత్తం రక్తపాతంతో నింపేశారు. గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా ఇదే వైబ్స్ క్రియేట్ చేసింది. ఏంటి మరి, ‘మాచర్ల నియోజకవర్గం’లో రక్తం ఏరులై పారాల్సిందేనా.!
నిజానికి నితిన్‌కి కూల్ అండ్ లవ్‌లీ సినిమాలు బాగా వర్కవుట్ అవుతాయి. ‘భీష్మ’ అంత పెద్ద విజయం సాధించడానికి కారణం అదే. అయితే, ‘రంగ్ దే’ నిరాశపరిచిందనుకోండి. అయినా కానీ, కూల్ అండ్ లవ్‌లీ చాక్లెట్ బోయ్‌లా కనిపిస్తే నితిన్ అందరికీ నచ్చుతాడు.
కానీ, ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో అలాంటి అంశాలను ఆశించడానికి లేదనిపిస్తోంది ప్రోమోస్ చూస్తుంటే. కలెక్టర్ పాత్ర అంటే చాలా డిగ్నిఫైడ్‌గా ఇంటెలిజెంట్‌గా క్లాస్‌గా కనిపించాలి. కానీ, కత్తి పట్టి రక్తపాతం సృష్టించేస్తున్నాడీ కలెక్టర్ బాబు. అయితే, ఈ సినిమాలో నితిన్ కత్తి పట్టడానికి ఓ బలమైన కారణం వుందట. అది సినిమా చూస్తే అర్ధమవుతుందట.
సినిమా చూశాకా, ఓ ఉన్నతమైన వృత్తిలో వున్న కలెక్టర్ ఎందుకు కత్తి పట్టాల్సి వచ్చింది.? అనే విషయంపై ఖచ్చితంగా కన్విన్స్ అవుతాడట సగటు సినీ ప్రేక్షకుడు. ఏది ఏమైనా కొత్త డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ద్వారా నితిన్‌లోని ఓ సరికొత్త యాంగిల్‌ని చూపించబోతున్నాడని అర్ధమవుతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.