తెలంగాణలోని దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నిక ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అక్కడ అధికార పార్టీని ఓడించి మరీ… బీజేపీ అభ్యర్థి విజయం సాధించాడు. కేంద్రం కూడా దుబ్బాక ఉప ఎన్నికపై దృష్టి సారించింది అంటే ఆ ఎన్నికలు ఎంత రేంజ్ కు వెళ్లిపోయాయో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావడం… తన నియోజకవర్గం పక్కదే దుబ్బాక కావడం.. ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని గ్రౌండ్ వర్క్ చేసినా కూడా పార్టీ గెలవలేకపోయింది.
అయితే… బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అయితే.. ఈ ఎన్నికలపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఆయన దుబ్బాక ఉప ఎన్నిక విషయంలోనూ చంద్రబాబును వదల్లేదు. ఆయన కొడుకు నారా లోకేశ్ ను వదల్లేదు. సాధారణంగా విజయసాయిరెడ్డి.. ఎప్పుడూ చంద్రబాబు, లోకేశ్ ను ట్విట్టర్ లో ఎగతాళి చేస్తుంటారు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికను ఉపయోగించుకొని భలే ట్వీట్ చేశారు.
తండ్రేమో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మన మాలోకం ప్రధాన కార్యదర్శి.. ఇద్దరికీ దుబ్బాక ఉప ఎన్నికలో పోటీకి పెట్టడానికి అభ్యర్థి దొరకలేదు. అక్కడ బీజేపీ పార్టీ గెలిస్తే సొంత పార్టీ గెలిచినట్టు.. మురిసిపోతున్నారు. ఇంకొకరి గెలుపును ఇలా పండుగ చేసుకోవడం దేశంలో ఎక్కడా చూడలేదు. వింతల్లోకెల్లా వింత ఇది.. అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తండ్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాలోకం ప్రధాన కార్యదర్శి. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ పెట్టడానికి అభ్యర్థి దొరకలేదు. అక్కడ బిజెపి గెలిస్తే సొంత పార్టీ విజయం సాధించినట్టు మురిసి పోతున్నారు. ఇంకొకరి గెలుపును ఇలా పండుగ చేసుకోవడం దేశంలో ఎక్కడా చూడలేదు. వింతల్లోకెల్ల వింత ఇది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 12, 2020