వైజాగ్… ఏపీలోనే పెద్ద సిటీ. కానీ.. దాని అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వమూ ఎక్కువ దృష్టి కేంద్రీకరించదు. దానికి కారణం అది ఎక్కడో మూలన ఉండటం. అయినప్పటికీ.. వైజాగ్ కు ఉన్న సహజ వనరుల కారణంగా అది డెవలప్ అవుతూనే ఉన్నది.
అయితే.. వైజాగ్ నుంచి ఎన్నికైన సభ్యులు విశాఖ సమస్యల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. కానీ.. వైసీపీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. విశాఖలో నెలకొన్న ఎన్నో సమస్యల మీద ఆయన తన గళాన్ని విప్పుతున్నారు.
ప్రస్తుతం విశాఖ సమస్యల మీద స్పందిస్తున్న నేత ఎవరైనా ఉన్నారా? అంటే ఆయన విజయసాయిరెడ్డి అనే చెప్పుకోవాలి.
రాజ్యసభ ఎంపీగా.. వైజాగ్ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురావడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారు. కేంద్రానికి ఊపిరి ఆడనీయకుండా… సభలో వైజాగ్ సమస్యలను లేవనెత్తుతున్నారు ఆయన. దీంతో కేంద్రం కూడా ఆయన ప్రశ్నలకు బదులు చెప్పాల్సి వస్తోంది.
వైజాగ్ కు సంబంధించి.. అరకుకు వెళ్లే ట్రెయిన్ కు కోచ్ లను పెంచడం కూడా రైల్వే మంత్రితో ఓకే చేయించారు విజయసాయిరెడ్డి. అలాగే వైజాగ్ నుంచి తిరుపతికి, హైదరాబాద్ కు ప్రత్యేక ట్రెయిన్స్ నడపాలని విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరగా… దానికి కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది.
అలాగే.. వైజాగ్ ను ఐటీ రంగంలో మేటీగా చేయడం కోసం, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ఆయన కేంద్రానికి విన్నపాలు చేస్తున్నారు. కేంద్రం వైజాగ్ కు నిధులు ఇస్తేనే ఇవన్నీ సాధ్యం అవుతాయని ఆయన కేంద్రాన్ని కోరుతున్నారు. ఇలా వైజాగ్ కు సంబంధించిన ప్రతి సమస్యను కేంద్రం ముందుంచి.. కేంద్రం నిధులు ఇస్తే వైజాగ్ ను అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేస్తామని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు.
ఇలాగే.. ప్రతి ప్రతినిధి.. తన నియోజకవర్గం కోసం పోరాడితే… ఏ ప్రాంతంలో నెలకొన్న సమస్యలైనా వెంటనే తీరిపోతాయి.