వామ్మో.. తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాజకీయ నాయకులు నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నిక మీద అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ జరుగుతోంది.
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి హరీశ్ రావు దుబ్బాక ఉపఎన్నికను దగ్గరుండి చూసుకుంటుండగా… కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఇక.. రేవంత్, హరీశ్ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది రోజూ. దుబ్బాకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇరు పార్టీల నేతలు ఒకరిని ఇంకొకరు దూషించుకోవడమే సరిపోతోంది.
తాజాగా… దుబ్బాక నియోజకవర్గంలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
ముత్యంరెడ్డి బతికున్నప్పుడు దుబ్బాకను ఎంతో అభివృద్ధి చేశారు. మళ్లీ దుబ్బాకను అంత స్థాయిలో అభివృద్ధి చేయాలంటే.. ఆయన కొడుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలి. ఎట్టిపరిస్థితుల్లో ముత్యంరెడ్డి ఆశయాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకోవాలి. దుబ్బాకలో కాంగ్రెస్ ఓడిపోయినా కూడా పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు కానీ.. ప్రజల కష్టాలు ఇంకాస్త పెరుగుతాయి. వాళ్ల కష్టాలు తీరవు. చెట్టంత పెరిగాడు కానీ… హరీశ్ రావుకు దమాక్ లేదు.. అంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
వంద మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా తమ నియోజకవర్గాల అభివృద్ధిని పక్కన పడేసి.. కేసీఆర్ దొడ్లో పెండ తీయడానికి పనిచేస్తున్నారు. ఇక్కడ గెలిచి.. పాలు పిండుతాడా? అంటూ ఆయన విమర్శలు చేశారు.