ఎంపీ రఘురామకృష్ణమరాజు వైకాపాకి గుడ్ బై చెప్పడంతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. పార్టీ నుంచి బయటకు వస్తూనే సంచలన ఆరోపణలు, విమర్శలు చేస్తూ బయటకు రావడం….అదిష్టానం పంపిన షోకాజ్ నోటీస్ పై దీటైన బధలివ్వడంతో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక అంతకు ముందే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ హోమంత్రిని, స్పీకర్ ని కోరడంతో అంతే ఆసక్తికరంగా మారింది. ఇదే తరహాలో వైకాపాకి రాం రాం చెప్పే ముందు హుటాహుటిన రాత్రికే రాత్రే ఢిల్లీ వెళ్లడం రఘురాం వ్యవహారాన్ని అంత ఈజీగా తీసుకోలేదని అర్ధమైంది. అయితే తాజాగా శుక్రవారం మరోసారి హస్తినా కు పయనం అయ్యారు.
ఈరోజు ఎన్నికల కమీషన్, హోంశాఖ అధికారులను కలవనున్నట్లు సమాచారం. ఇరువురితో భేటీ అయి ఏపీ పరిస్థితులను, వైకాపా పై ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వ సనీయ వర్గాల సమాచారం. దీంతో రఘురాం ఢిల్లీ టూర్ మరోసారి వైకాపా సహా అన్ని రాజకీయ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రంలో ఉన్న ఓ తెలుగు బీజేపీ వ్యక్తి కీలకంగా వ్యవరహారిస్తున్నట్లు సమాచారం. రఘురాం కేంద్రంలో ఉన్న కీలక వ్యక్తుల్ని కలవడంలో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. నేడు అపాయింట్ మెంట్ దొరకడానికి కూడా కారణం అతని పేరే వినిపిస్తోంది.
ఏదేమైనా ఎంపీ రఘురాం డేరింగ్ మాములుగా లేదు. అధికారంలో ఉన్న పార్టీపై విమర్శలు చేసి..నేరుగా కేంద్రంతోనే వ్యవహారాలు నడిపించడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ అవకాశాన్ని టీడీపీ వినియోగించుకునే అవకాశం లేకపోలేదన్న సంకేతాలు జోరుగా అందుతున్నాయి. వచ్చిన అవకాశాన్ని..దొరికిన లాజిక్ ను వాడుకోవడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిది ఆరితేరిన చేయి. ఈ నేపథ్యంలో రఘురాంని తనవైపు ఎలా తిప్పుకుంటారో చూడాలి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.