మరోసారి జగన్ ఢిల్లీ వెళ్లనున్నారా! వెళ్తే మాత్రం రఘురామకు మూడింది

cm jagan pm modi telugu rajyam

ఆంధ్రపదేశ్ లో ఏదైనా ఒక నాయకుడు ఢిల్లీ వెళ్తే చాలు అతని చుట్టూ, అతని పార్టీ చుట్టూ ఎవరికి ఇష్టమొచ్చిన కథనాలు వాళ్ళు రాస్తూ ఉంటారు, లైవ్ ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తూ ఉంటారు. మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంపై ఎంత రచ్చ జరిగిందో అందరికి తెలుసు. అయితే ఇప్పుడు మరోసారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. వచ్చే వారంలో జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

again jagan goint to delhi
again jagan goint to delhi

మరోసారి వెళ్తే రఘురామ పరిస్థితి ఏంటో!

కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇటీవల ఢిల్లీకి వెళ్ళొచ్చాక రాష్ట్రంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి వైసీపీ ఎంపీ రఘురామరాజుకి సంబందించిన వ్యాపార కార్యకలాపాలపై సీబీఐ సోదాలు చెయ్యడం, రెండోది సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు చెయ్యడం. ఈ రెండిటికీ ఢిల్లీ పెద్దల నుంచి వైఎస్‌ జగన్‌ అనుమతి పొందారన్న చర్చ ఓ పక్క గట్టిగా జరుగుతోంది. అయితే ఈ విషయాలపైనే మరోసారి చర్చించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీకి రెబల్ గా మారిన రఘురామ కృష్ణంరాజు గత కొన్నిరోజుల నుండి వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నిరోజులు జగన్ రఘురామను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు రఘురామను బలంగా దెబ్బకొట్టడానికి పతకం రచించారని, అందుకోసమే మరోసారి జగన్ ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. రానున్న రోజుల్లో రెబల్ గా మారిన రఘురామ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో వేచి చూడాలి.

ప్రత్యేక హోదా గురించి మాట్లాడరా!

ఢిల్లీ వెళ్తున్న ఏపీ రాజకీయాలు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీకి వెళ్తున్న, వెళ్లిన నాయకులందరు తమ సొంత ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దలను కలుస్తున్నారు కానీ ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడానని చెప్పలేదు. అసలు ఆ ప్రస్తావన రావడం లేదని నాయకుల ప్రవర్తనను చూస్తే తెలుస్తుంది.