2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక విజయం సాధించడానికి కారణం ఆయనలో ఉన్న పట్టుదల. ఆ పట్టుదలతోనే అధికారం చేపట్టిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి తన పాలనను కొనసాగిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు జగన్ కు, వైసీపీకి కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే అనేకసార్లు జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల వైసీపీ నేతలు, ప్రభుత్వ అధికారులు కూడా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన సీఎం పదవికే ముప్పు ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.
క్రిస్టమస్ వరకు జగన్ పదవి పోతుందా!
జగన్ చేసిన తప్పుల్లో అతిపెద్ద తప్పు ఏదన్నా ఉందంటే అది సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం. ఇలా చేయడం వల్ల జగన్ ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తప్పు జగన్ పదవి క్రిస్మస్ నాటికల్లా పోతుందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు జోస్యం చెప్పేసారు. అపుడే తాను ఏపీకి వస్తాను అంటున్నారు. ఇక విశాఖ ఆక్టోపస్ సబ్బం హరి కూడా జగన్ సీఎం గా ఎక్కువ రోజులు ఉండరని అంటున్నారు. ఇవి వైసీపీలో పెద్ద ఎత్తున అలజడిని రేకెత్తిస్తున్నాయి. మరి ఇలాగే జరుగుతుందా. అలా జరిగితే గతి గత్యంతరం ఏంటి అన్నది కూడా వారిని పట్టిపీడిస్తోంది.
మోడీనే జగన్ ను కాపాడాలి
ఈ సుప్రీం వివాదంలో జగన్ కు మంచి జరగాలంటే బీజేపీ పెద్దలు ఖచ్చితంగా చొరవ తీసుకోవలసిందేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సుప్రీం కోర్తు ప్రధాన న్యాయమూర్తి చేతిలో బంతి ఉంది. అదే సమయంలో కేంద్రంలోని ప్రభుత్వం కూడా ఇపుడు చాలా ముఖ్యమైన పాత్ర వహించాలి. కేంద్రం చొరవ తీసుకుంటేనే ఈ వివాదానికి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది అని అంటున్నారు. కేంద్రం కూడా ఈ విషయంలో జగన్ కు అనుకాలంగా వ్యవహరించే అవకాశలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి జగన్ అవసరం చాలా ఉంది. కాబట్టి జగన్ ను ఈ గండం నుండి మోడీ గట్టెక్కిస్తారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కానీ న్యాయ వ్యవస్థ, శాసనవ్యవస్థల మధ్య ఘర్షణ మంచిది కాదు అని కూడా అంతా అంటున్నారు. జగన్ అక్టోబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లారు. అపుడే ఆయన లేఖను సీజేఐకి రాశారు. మరి కేంద్ర పెద్దలతో సంప్రదించకుండా ఇంతటి రిస్క్ తీసుకుంటారా అన్నది ఒక వైపు వాదన.