Hyderabad: రోజు రోజుకి సమాజంలో స్త్రీల పట్ల అఘాయిత్యాలు, అత్యాచారాలు, మానసిక హింసలు ఆగడం లేదు. ప్రభుత్వం మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్న దాడులు మాత్రం ఆగడం లేదు. ఒకవైపు అత్యాచారాలు, హత్యలతో ఈ రోజుల్లో ఎంతోమంది మహిళలు చనిపోతున్నారు. ఇది చాలదు అన్నట్లు మరొకవైపు మహిళలు వరకట్న వేధింపుల విషయంలో, అక్రమ సంబంధాల విషయంలో, అత్తమామలు భర్తలు వేధింపుల విషయంలో మానసికంగా బాధను అనుభవిస్తూ తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు మహిళలు అయితే వారిపై జరుగుతున్న దాడులు, చిత్రహింసల గురించి బయటకు చెప్పలేక లోలోపల కుమిలిపోతూ చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
చాలామంది మహిళలు అదే విధంగా ధైర్యం చేసి నలుగురికి చెప్పలేక, చెబితే ఎక్కడ చంపేస్తారేమో అన్న భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా సమాజంలో రోజురోజుకీ సభ్య సమాజం తలదించుకునే విధంగా మానవత్వం మంట కలిసిపోయే విధంగా మహిళలపై నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక గృహిణి కి ఏమి బాధ వచ్చిందో ఏమో తెలియదు కానీ తన పిల్లలను తీసుకొని ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన మొఘల్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ రవి కుమార్ తెలిపిన వివరాల మేరకు లాల్ దర్వాజా బచ్చన దేవాలయం ప్రాంతానికి చెందిన వెంకటరమణ, రంగనగిరి సింధుల దంపతులు నివసిస్తున్నారు.
ఈ దంపతులకు రోహిత్ (5), మోక్షా (4) అనే ఇద్దరు పిల్లల సంతానం కూడా ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సింధు ఈనెల 8వ తేదీన ఉదయం 10 గంటల సమయం లో ఇంట్లో ఉన్న పెద్దలకు చెప్పకుండానే తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఉదయం అనగా వెళ్లిన సింధూ మళ్ళీ ఇంటికి రాలేదు. కంగారు పడిన కుటుంబ సభ్యులు దగ్గరలోని బంధువులు తెలిసిన వారిని అడగగా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీనితో వెంకటరమణ తన భార్య పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సింధూ తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటకు ఎందుకు వెళ్ళింది? ఎక్కడికి వెళ్లింది? ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.