గాసిప్స్ : “హరిహర వీరమల్లు” లో మరిన్ని బాలీవుడ్ హంగులు.?

harihara veeramallu

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం తెలిసిందే. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అయితే తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొల్పుకొని సిద్ధం అవుతుంది. మరి సమయం దొరికినప్పుడల్లా పవన్ తన సినిమా షూటింగ్ ని జెట్ స్పీడ్ లో కానిచ్చేస్తుండగా.. 

ఇప్పుడు కూడా రామోజీ ఫిలిం సిటీ లో తాను షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరి క్రిష్ అయితే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో సరైన ప్లానింగ్స్ తో చేస్తుండగా బాలీవుడ్ హంగులు కూడా తాను ఎక్కువే అద్దుతున్నాడు. మరి ఇప్పటికీ పలువురు బాలీవుడ్ నటులు సినిమాలో ఎంపిక చేయగా.

ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ ని సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది. మరి ఆ నటుడు అయితే బాబీ డియోల్ కాగా తాను ఇప్పటికే ఓటిటి లో మంచి స్టార్ గా కూడా ఉన్నాడు. మరి అతన్ని క్రిష్ అయితే ఈ సినిమాలో తీసుకున్నాడట.

ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు.