ఆంధ్రప్రదేశ్ వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు స్టిక్కర్ ఉన్న కారులు 5.27 కోట్ల రూపాయల నగదు చిక్కడంతో రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. అసలు మ్యాటర్‌లోకి వెళితే.. తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఉన్న చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, బాలినేని శ్రీనివాసరావు స్టిక్కర్ ఉన్న వాహనంలో భారీగా నగదు చిక్కింది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే ఇక్కడ వాహనం మాత్రం తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ఉండడం గమనార్హం. ఇక ఆ వాహనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరో కావాలనే తన పేరుతో ఉన్న స్టిక్కర్‌ను వాడుకున్నారని మంత్రి బాలినేని మీడియా ద్వారా తేల్చి చెప్పారు. అంతే కాకుండా ఆ కారుపై ఉన్న స్టిక్కర్‌ను గమనిస్తే అది ఒరిజినల్ కాదని, జిరాక్స్ కాపీ అని, ఆ డబ్బుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయితే ఈ వ్యవహారం పై కోణాల్లో విచారణ జరిపించాలని, తప్పు ఎవరిదైనా శిక్షించాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.