బిగ్ బాస్ ఇంట్లో ఒకలా బయట మరోలా.. డ్రెస్సింగ్‌పై మోనాల్ కామెంట్స్

బిగ్ బాస్ షోలో మోనాల్ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. వీకెండ్ వస్తే చాలా మోనాల్ తన అందాలను ఆరబోసేందుకు వెరైటీ వెరైటీ డ్రెస్సులను ధరించేది. ప్రతీ రోజూ కనిపించే మోనాల్ వేరు.. వీకెండ్ ఎపిసోడ్‌లో మోనాల్ చేసే ఎక్స్ పోజింగ్ వేరు. అలా చేయమని బిగ్ బాస్ టీం ముందే చెప్పినట్టుందని, అందుకే ఆమె అలా చేస్తోందని ఆ మధ్య నెటిజన్లు బాగానే ట్రోల్ చేశారు. అయితే ఆమెతో పాటు ఉన్న కంటెస్టెంట్లు కూడా బయటకు వచ్చాక అవే కామెంట్లు చేశారు.

Monal Gajjar About Her Dressing And Trolling
Monal Gajjar about Her Dressing And Trolling

బిగ్ బాస్ షోలో మోనాల్ చేసే ఎక్స్‌పోజింగ్‌పై కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె అలా చూపిస్తోంది కాబట్టే ఇంకా ఉంచుతున్నారు.. మేం అలా చూపించలేం కాబట్టి మమ్మల్ని ఇలా ఎలిమినేట్ చేసేశారమో అని కరాటే కళ్యాణి ఆ మధ్య చెప్పుకొచ్చింది. అయితే తాజాగా మోనాల్ మాట్లాడుతూ తన డ్రెస్సింగ్, కంటెస్టెంట్లు మాట్లాడిన మాటలపై స్పందించింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా బయటకు వచ్చాక మరోలా మాట్లాడుతున్నారని ఫైర్ అయింది.

తన డ్రెస్సింగ్‌పై వచ్చిన ట్రోలింగ్ గురించి మోనాల్ మాట్లాడుతూ.. నాతో పాటు హౌస్‌లో ఉన్న వాళ్లు కూడా నా డ్రెస్ గురించి బ్యాడ్‌గా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. నేను ఆ డ్రెస్ వేసుకుని ఈ డ్రెస్ ఎలా ఉంది అని వాళ్లని అడిగినప్పుడు చాలా బాగుందని చెప్పేవారు. బయటకు వచ్చిన తరువాత చాలా బ్యాడ్ డ్రెస్‌లు వేసుకుంది అని చెప్తున్నారు. ఏదైనా ఉంటే ముఖంపై చెప్పొచ్చుకదా.. నా డ్రెస్ బాలేకపోతే నాతో చెప్పొచ్చు కదా. నా వెనుక మాట్లాడటం దేనికి? అంటూ కరాటే కళ్యాణిపై పరోక్షంగా మోనాల్ సెటైర్లు వేసినట్టు కనిపిస్తోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles