హెయిర్ డ్రెసర్ నాగ శ్రీనుపై హీరో మోహన్ బాబు కుల దూషణ చేశాడంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య మంచు ఫ్యామిలీపై మండిపడ్డారు. మోహన్ బాబు నాయీ బ్రహ్మాణ సంఘంతో పాటు బీసీ జాతికి క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఒక్క శాతం కూడా లేని వారు 56 శాతం ఉన్న బీసీలను అవమానిస్తారా అంటూ ధ్వజమెత్తారు. సినీ హీరో అయితే.. ఏమన్నా మాట్లాడుతారా.. అగ్రకుల దురంహకారంతో పేదలను అవమానిస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.